దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణ ముమ్మరమౌతోంది. పెద్దల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్న తరుణంలో..ఏపీ అధికార పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డి అరెస్టు కావడం సంచలనంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దర్యాప్తు వేగవంతమౌతోంది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత పేర్లు ఇప్పటికే వెలుగు చూశాయి. ఈ కేసులో తీగ లాగేకొద్దీ ప్రముఖుల పేర్లు విన్పిస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఏపీ అధికార పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలున్నాయి. ఎందుకంటే రాఘవరెడ్డిని ఈ కేసులో కీలక వ్యక్తిగా ఈడీ చూపించింది. 180 కోట్ల నేరపూరిత ఆర్ధిక లావాదేవీల్లో రాఘవరెడ్డి పాత్ర ఉందని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్ కంపెనీలో రాఘవరెడ్డిని భాగస్వామిగా చూపించింది. మరోవైపు మాగుంట ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రెండు రిటైల్ జోన్స్ కూడా ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో ఉంది. 


రాఘవరెడ్డిని 10 రోజుల కస్టడీకు అనుమతించిన న్యాయస్థానం కేసు విచారణను 21వ తేదీకు వాయిదా వేసింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు సౌత్ గ్రూప్ 100 కోట్లు ఇచ్చినట్టుగా ఈడీ అభియోగం మోపింది. సౌత్ గ్రూప్‌లో కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి పేర్లున్నాయి. రిమాండ్ రిపోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. 


ఇండో స్పిరిట్ సంస్థలో ఎమ్మెల్సీ కవితకు ప్రతినిధిగా అరుణ్ పిళ్లై వ్యవహరించాడనే విషయం అరుణ్ పిళ్లైను విచారించిన సమయంలోనే మాగుంట విషయాలు వెల్లడయ్యాయని ఈడీ తెలిపింది. కేజ్రీవాల్‌ను మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిసినట్టుగా అరుణ్ పిళ్లై వాంగ్మూలం ఇచ్చినట్టు ఈడీ తెలిపింది. 


Also read: Scorpio Rams into Baraat: పెళ్లి ఊరేగింపు బృందాన్ని తొక్కుకుంటూ వెళ్లిన స్కార్పియో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook