Raaj Kumar Anand: పార్టీ అధినేత జైల్లో ఉండగా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న సీనియర్‌ నాయకుడు రాజీనామా చేయడం కలకలం రేపింది. ఆయన మంత్రి పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఢిల్లీ రాజకీయాల్లో భారీ కుదుపు ఏర్పడింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని భావిస్తున్న బీజేపీ అతడితో రాజీనామా చేయించిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Lok Sabha Polls: ఎంపీ ఎన్నికలకు రేవంత్‌ రెడ్డి భారీ వ్యూహం.. అలా నామినేషన్‌.. ఇలా ప్రచారం


 


ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టయి ప్రస్తుతం తిహార్‌ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన జైల్లో ఉండగా ఢిల్లీలో మాత్రం అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నాయకుడు, మంత్రి రాజ్‌ కుమార్‌ ఆనంద్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవికి, పార్టీ సభ్యత్వానికి అకస్మాత్తుగా రాజీనామా చేశారు. రాజీనామా చేయడంతోపాటు పార్టీపై, అరవింద్‌ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం గమనార్హం.

Also Read: Student Warn To Teacher: 'సార్‌ మార్కులు వేయకుంటే చేతబడి చేయిస్తా'.. జవాబుపత్రంలో విద్యార్థి వార్నింగ్‌


 


'అవినీతి నిర్మూలన లక్ష్యంగా ఆమ్‌ఆద్మీ పార్టీ ఆవిర్భవించింది. అలాంటి పార్టీ ఇప్పుడు అవినీతిలో పాలుపంచుకున్న పార్టీగా పతనమైంది' అని రాజ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. 'అవినీతిపై పోరాటంలో బలమైన సందేశాన్ని చూసిన తర్వాత నేను ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ అవినీతి కార్యకలాపాల కూపంలో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో మంత్రిగా కొనసాగడం ఇబ్బందిగా ఉంది. దీని కారణంగానే నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా' అని ప్రకటించారు. పటేల్‌ నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజ్‌కుమార్‌ ఢిల్లీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.


అనూహ్యంగా రాజ్‌ కుమార్‌ రాజీనామా చేయడాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ తప్పుబట్టింది. అతడి రాజీనామా వెనుక బీజేపీ ఉందని ఆప్‌ నాయకుడు సంజయ్‌ సింగ్‌ ఆరోపించారు. 'మంత్రులు, మా ఎమ్మెల్యేలపై బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు పాల్పడుతోంది. ఇది మాకు పరీక్ష కాలం' అని తెలిపారు.


కాగా.. ఈ కీలక పరిణామం వెనుక బీజేపీ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్‌ ఆఫర్‌ చేయడంతోనే ఆనంద్‌ కుమార్‌ రాజీనామా చేశారని తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చాలని, ఆమ్‌ ఆద్మీ పార్టీని దెబ్బతీయాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ మద్యం కేసు తెరపైకి వచ్చిందని.. అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter