Satyendar Jain: ఢిల్లీలో హవాలా మనీలాండరింగ్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈనేపథ్యంలోనే ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి చెందిన మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 2015-16లో హవాలా నెట్‌వర్క్‌ ద్వారా సత్యేందర్‌ జైన్‌ కంపెనీలకు షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు వెళ్లినట్లు ఈడీ విచారణలో తేలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకముందు ఈకేసును సీబీఐ దర్యాప్తు  చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా హవాలా కేసును అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల సత్యేందర్, ఆయన కుటుంబసభ్యులకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌  చేసింది. తాజాగా సత్యేందర్‌ను అరెస్ట్ చేసింది. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై రాజకీయ దుమారం సైతం కొనసాగుతోంది.


ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్ట్‌పై ఇదివరకే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో త్వరలో తమ పార్టీ నేతను ఈడీ అరెస్ట్ చేయబోతోందని అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇదంతా జరుగుతుందని వ్యాఖ్యనిచ్చారు. గతంలో సత్యేందర్‌పై ఈడీ రెండుసార్లు దాడులు చేసినా..ఏమి దొరకలేదన్నారు. ఈడీ అధికారులు మళ్లీ రావాలనుకుంటే వారికి స్వాగతం అని చెప్పారు. ఇప్పుడా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


మనీలాండరింగ్ కేసులో మంత్రి సత్యేందర్‌ జైన్‌ను ఈడీ అరెస్ట్ చేయడంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా మండిపడ్డారు. ఆయనను ఈడీ ఎన్నిసార్లు విచారించినా..ఏ ఆధారాలు దొరకలేదని గుర్తు చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలకు ఆప్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారనే అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదన్నారు.


Also read: TS Inter Board: ఏ సబ్జెక్ట్‌ను తొలగించడం లేదు..తెలంగాణ ఇంటర్ బోర్డు క్లారిటీ..!


Also read:Chandra Babu Letter: గ్రానైట్ అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయండి..సీఎస్‌కు చంద్రబాబు లేఖాస్త్రం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook