Delhi Covid Wave: దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతోంది..కరోనా మహమ్మారి పంజా విసరడానికి కారణమేంటి..ఢిల్లీలో కోవిడ్ మరో కొత్త వేవ్ వస్తోందా..కేసులు అంత భారీగా ఎలా పెరిగాయి..
దేశ రాజదాని ఢిల్లీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకూ కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో ఢిల్లీలో ఏకంగా 1204 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అటు కరోనా పాజిటివ్ రేటు 4.64 శాతంగా ఉంది. రోజుకు వేయికి పైగా కేసులు నమోదవడం వరుసగా ఇది ఐదవరోజు.
అంతకుముందు సోమవారం నాడు ఢిల్లీలో 1011 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 6.42 శాతంగా ఉంది. ఆదివారం నాడు 1083 కొత్త కేసులు నమోదు కాగా పాజిటివిటీ రేటు 4.48 శాతంగా ఉంది. అంతకుముందు రోజు 1094 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫిబ్రవరి 10 తరువాత ఇదే అత్యధికం. గత వారం రోజుల్నించి ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరగడంతో..కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 601 నుంచి ఒక్కసారిగా 4 వేల 508 కు చేరుకుంది. ఇదంతా కేవలం 15 రోజుల స్వల్ప వ్యవధిలో. ప్రస్తుతం ఢిల్లీ ఆసుపత్రుల్లో 114 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతుండగా.. 3 వేల 190 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక 9 వేల 378 బెడ్స్ కోవిడ్ రోగుల కోసం రిజర్వ్ చేసి ఉంచారు. ఇందులో 139 భర్తీ అయ్యాయి.
కోవిడ్ సంక్రమణ పెరుగుతుండటంతో ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధారణ తప్పనిసరి చేసింది. ఉల్లంఘిస్తే 5 వందల రూపాయల జరిమానా విధిస్తోంది. కరోనా ఫోర్త్‌వేవ్ సంకేతాల నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కేవలం 15 రోజుల్లో కేసుల యాక్టివ్ కేసుల సంఖ్య వందల్నించి వేలల్లో చేరుకోవడం చూస్తుంటే..ఢిల్లీలో మరో కోవిడ్ వేవ్ ప్రారంభమైనట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also read: India Corona Cases: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 24 గంటల్లో 2,927 కేసులు నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.