Delhi NCR Earthquake Updates: ఢిల్లీ, ఎన్‌సీఆర్‌తో సహా వివిధ ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. చాలా సేపు భూకంప ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రాన్ని ఆఫ్ఘనిస్థాన్‌లో గుర్తించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. భారత్‌తో పాటు పాకిస్థాన్, తజికిస్థాన్, చైనాలో కూడా భూకంపం సంభవించింది. భూకంపం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు లక్నో, జమ్మూ-కశ్మీర్, పంచకుల, చండీగఢ్, హర్యానా, ఉత్తరాఖండ్, పంజాబ్‌‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


 



రాత్రి 10.17 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. దాదాపు 45 సెకన్ల పాటు భూకంపం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇళ్లలోని ఫ్యాన్ల నుంచి లైట్లు, ఇతర వస్తువులు కూడా వేగంగా వణుకుతున్నాయని తెలిపారు. ప్రజలు ఇళ్ల నుంచి బయట ఉన్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రజలు రాత్రి భోజనం తర్వాత నిద్రించడానికి సిద్ధమవుతున్నప్పుడు తరుణంలో ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో భయానక భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చాలా మంది వీధులు, పార్కుల వైపు పరుగులు తీశారు. 



ఆఫ్ఘనిస్తాన్‌లోని కలాఫ్గన్‌కు 90 కిలోమీటర్ల దూరంలో రాత్రి 10:17 గంటలకు ప్రకంపనలు వచ్చినట్లు సిస్మోలజీ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఎక్కడా కూడా ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం లేదు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 




సిరియా, టర్కీ దేశాలను వణికించిన భూకంపం.. తాజాగా భారత్‌ను తాకడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. గత నెలలో గుజరాత్‌లో కూడా భూకంపం సంభవించగా.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది.


గత నెల 22వ తేదీన ఢిల్లీ, చెన్నై నగరాల్లో ఒకేరోజు భూమి కంపించింది. ఎన్‌సీఆర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానాలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు సంభవించగా.. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ సమీపంలో భూకంప కేంద్రం గుర్తించారు. చెన్నైలోని అన్నారోడ్డు సమీపంలోని వైట్స్ రోడ్ ప్రాంతంలో అదే రోజు స్వల్పంగా భూమి కంపించింది. మూడంతస్తుల భవనంలో ప్రకంపనలు రావడంతో ఉద్యోగులు.. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ రెండు ప్రమాదాల్లో ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మరోసారి దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో భూప్రకంపనలు సంభవించడం ఆందోళనకు గురిచేస్తోంది. 


 


Also Read: MLC Kavitha ED Enquiry: ఊపిరిపీల్చుకున్న బీఆర్ఎస్ వర్గాలు.. ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ  


Also Read: MLC Kavitha: వరుసగా ఫోన్లను మార్చిన ఎమ్మెల్సీ కవిత.. రహాస్య వ్యవహారాల కోసమేనా..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి