Tihar Jail Prisoner Suicide: దేశ రాజధాని ఢిల్లీలోని తిహార్ జైలులో అనూహ్య ఘటన వెలుగుచూసింది. జైలు నంబర్ 3లోని ఒకటో నంబర్​ వార్డులో ఉన్న ఐదుగురు ఖైదీలు ఆత్మహత్యకు ప్రయత్నించారు. పుదునైన ఆయుధాలతో తమను తాము తీవ్రంగా గాయపరుచుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ఐదుగురు గొడవ పడడాన్ని గమనించిన జైలు సిబ్బంది.. వెంటనే వాళ్లను విడదీశారు. దీంతో వాళ్లలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. గాయపడ్డ ఐదుగురిని హుటాహుటిన జైలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఓ ఖైదీని మాత్రం దీన్​దయాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.


అయితే ఆ ఐదుగురు ఖైదీలు ఆత్యహత్యకు ఎందుకు ప్రయత్నించారో తెలియదని అధికారులు తెలిపారు. జైలు గదిలో వీరంతా స్వయంగా గాయపరచుకున్నారని చెప్పారు. ఓ ఖైదీ ఉరి వేసుకునేందుకు ప్రయత్నించగా.. వేరే ఖైదీల కేకలు విని అక్కడకు వెళ్లినట్లు వివరించారు. 


ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించారో తెలియాల్సి ఉందని, ఆస్పత్రిలో ఉన్న ఖైదీలు ప్రస్తుతం మాట్లాడే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. జనవరి 3న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తిహార్ జైలు అధికారులు వెల్లడించారు.  


Also Read: Surat Gas Leak: సూరత్​లో విషాదం..గ్యాస్​ లీకై ఆరుగురు మృతి... 20మందికి అస్వస్థత!


Also Read: India Corona Cases Today: దేశంలో కరోనా విలయం.. లక్షకు చేరువైన కొవిడ్ కేసులు- 325 మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.