Delhi violence case: ఢిల్లీ ఎర్రకోట సాక్షిగా జరిగిన హింసాత్మక ఘటనలో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవాన రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి మోస్ట్ వాంటెడ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం(Central government)తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ( New farm laws )కు వ్యతిేకంగా రైతుల ఆందోళన  ( Farmers protest )కొనసాగుతోంది. ఇందులో భాగంగా జనవరి 26వ తేదీన  రైతులు ట్రాక్టర్ ర్యాలీ(Tractor rally) నిర్వహించారు. ఈ ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఎర్రకోటను ముట్టడించి ఖల్సా పతాకాన్ని ఎగురవేశారు. కొంతమంది కావాలనే రైతుల్ని రెచ్చగొట్టి ర్యాలీని హింసాత్మకంగా మారేలా ప్రేరేపించారనే ఆరోపణలున్నాయి. నినాదాలు చేస్తూ..బ్యారికేడ్లు ధ్వంసం చేస్తూ పోలీసుల్ని గాయపరుస్తూ ముందుకు దూసుకుపోయిన పరిస్థితి. పోలీసుల విధులకు ఆటంకం కల్గించడమే కాకుండా ఉద్యమాన్ని హింసవైపు నడిపించారనే ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా..మరి కొందరు సమర్ధించారు. ఎర్రకోట( Redfort )పై ఖల్సా జెండా ఎగురవేయడం వివాదాస్పదంగా మారింది. 


ఈ నేపధ్యంలో పోలీసులు చాలామందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తున్నారు. ఇందులో భాగంగా మోస్ట్ వాంటెడ్‌గా భావిస్తున్న మనీందర్ సింగ్‌ను ఢిల్లీ ప్రత్యేక పోలీసులు అదుపులో తీసుకున్నారు.  పీతమ్ పురాలోని అతని నివాసం నుంచి రెండు కత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు ( Delhi police )విచారిస్తున్నారు. విచారఅ అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 


Also read: Supreme court: కోర్టు జడ్జిమెంట్లను అనువదించే ఉద్యోగాలు మీ కోసం..ఎలా దరఖాస్తు చేయాలంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook