Delhi Coldest day of the winter: దేశ రాజధాని ఢిల్లీని చలిపులి (Delhi Cold) వణికిస్తోంది. నగరంలో ఆదివారం (డిసెంబర్ 18) ఉష్ణోగ్రతలు 4.6 డిగ్రీల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఈ శీతాకాలంలో ఢిల్లీలో ఇదే అత్యల్ప (Coldest day in Delhi) ఉష్ణోగ్రత కావడం గమనార్హం. గరిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా నమోదైంది. వాతావరణ శాఖ ప్రకారం... కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు సమానం లేదా అంతకన్నా తక్కువగా నమోదై.. గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కన్నా 4.5డిగ్రీలు తక్కువగా ఉన్నప్పుడు దాన్ని 'చలి రోజు'గా పరిగణిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు (Delhi Winter Temperature) రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో మున్ముందు ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉండవచ్చు. ప్రస్తుతం వాయువ్యం నుంచి వీస్తున్న శీతల గాలులు మరికొద్దిరోజులు కొనసాగవచ్చునని చెబుతున్నారు. ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్తాన్‌లలోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్తాన్‌లోని గంగానగర్, చురు ప్రాంతాల్లో ఆదివారం మైనస్ 2.6, మైనస్ 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హర్యానాలోని నార్నౌల్, హిసార్‌లో ఈ సీజన్‌లోనే అత్యల్పంగా 1.2, 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


ఇక ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇప్పటికీ పేలవంగానే ఉంది. ఆదివారం (డిసెంబర్ 19) ఉదయం 9గంటల సమయంలో ఢిల్లీ (Delhi) ఎయిర్ క్వాలిటీ 290గా నమోదైంది. శనివారం అది 319గా ఉండగా... నిన్నటితో పోలిస్తే కాస్త మెరుగైంది.సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) జీరో నుంచి 50 వరకు ఉంటే.. అక్కడ గాలి నాణ్యత బాగున్నట్లు పరిగణిస్తారు. 51-100 మధ్యలో ఉంటే సంతృప్తికరంగా ఉందని,101-200 వరకు ఉంటే ఓ మోస్తరుగా ఉన్నట్లు పరిగణిస్తారు.అదే 201-300 వరకు ఉంటే అక్కడ గాలి నాణ్యత బాగాలేదని పరిగణిస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 301-400 మధ్య ఉంటే అది అద్వాన్నమైన స్థితిగా పేర్కొంటారు. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత 300కి కాస్త అటు ఇటుగా ఉంది.


Also Read: BB Telugu Grand Finale: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో వచ్చేసింది..గెస్ట్స్ ఎవరంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook