కరోనా మహమ్మారి దేశ రాజధానిని వణికిస్తోంది. మంగళవారం నమోదైన కరోనా కేసులు ఢిల్లీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఢిల్లీ(delhi)లో గత 24గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా (CoronaVirus Cases) కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 3,947 కేసులు వెలుగులోకి రాగా.. 68మంది కరోనాతో మరణించారు. దీంతో ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (Delhi Corona Cases) 66,602కు చేరింది. ఇప్పటివరకు 2,301మంది కరోనా కాటుకు బలయ్యారు. ప్రస్తుతం దేశ రాజధానిలో 24,988మంది కరోనాకు చికిత్స పొందుతుండగా, 39,313మంది ప్రాణాంతక కోవిడ్19 బారి నుంచి కోలుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోం మంత్రి షా ట్వీట్..  కేజ్రీవాల్ రీట్వీట్
జూన్ 26నాటికి ఢిల్లీలో కోవిడ్ రోగుల కోసం 20వేల పడకలు సిద్ధంగా ఉంటాయని మంగళవారం వరుస ట్వీట్ల ద్వారా హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు. ఇంకా కరోనా రోగుల కోసం వేయి పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నామని, దీనిలో 250 ఐసీయూ పడకలు ఉంటాయన్నారు. అంతేకాకుండా హోం మంత్రిత్వ శాఖ రాధా స్వామి సత్సంగ్‌లో 10,000 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను నిర్వహించే పనిని అప్పగించిందని, పనులు వేగంగా కొనసాగుతున్నాయని ట్వీట్‌లో పేర్కొన్నారు.  


ఆ ట్వీట్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) రీట్వీట్ ద్వారా స్పందించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆప్ ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రజలకు సాయమందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సైన్యం, వైద్య సిబ్బంది, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని, సమష్టిగా పోరాడితే కరోనాను ఓడిస్తామన్న నమ్మకముందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ