First omicron case in Delhi: భారత్‌లో ఐదో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) కేసు నమోదైంది. ఇటీవల టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తి ఒమిక్రాన్ బారినపడ్డాడు. ఢిల్లీలో (Delhi) ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు అక్కడి ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటిసారిగా కర్ణాటకలో (Karnataka) రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకరు 46 ఏళ్ల వైద్యుడు, మరొకరు 66 ఏళ్ల వృద్దుడు ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్‌లోని జామానగర్‌లో ఒక కేసు, మహారాష్ట్రలోని ముంబైలో ఒక కేసు వెలుగుచూశాయి. తాజాగా ఢిల్లీలో వెలుగుచూసిన కేసుతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఐదుకి చేరింది.


ఒమిక్రాన్ వేరియంట్‌ను (Omicron) మొదటిసారిగా ఈ ఏడాది నవంబర్ 25న దక్షిణాఫ్రికాలో (Southafrica) గుర్తించారు. మొదట బోత్సువానా, దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్ వేగంగా ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటివరకూ దాదాపు 25 దేశాల్లో 200 పైచిలుకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా సౌతాఫ్రికాలో 77 కేసులు, యూకెలో 22 కేసులు, బోత్సువానాలో 19 కేసులు నమోదయ్యాయి.


ఆసియాలో భారత్, శ్రీలంక, జపాన్, మలేసియా, సింగపూర్, సౌత్ కొరియా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు (Omicron Variant) బయటపడ్డాయి. ఒమిక్రాన్‌ను ఆందోళనకర వేరియంట్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు సౌతర్న్ ఆఫ్రికా దేశాల నుంచి విమాన రాకపోకలపై నిషేధం విధించాయి.


Also Read: Indonesia Volcano: బద్దలైన సెమెరు అగ్నిపర్వతం..13 మంది మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook