Omicron: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు-గుజరాత్‌లో గుర్తింపు-మూడుకి చేరిన కేసుల సంఖ్య

Third Omicron case in India: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు బయటపడింది. గుజరాత్‌లోని జామానగర్‌లో 72 ఏళ్ల ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లుగా నిర్దారణ అయింది. ఇటీవలే అతను జింబాబ్వే నుంచి దక్షిణాఫ్రికా మీదుగా భారత్ వచ్చినట్లు గుర్తించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 06:23 PM IST
  • గుజరాత్‌లో బయటపడ్డ ఒమిక్రాన్ కేసు
  • జింబాబ్వే నుంచి తిరిగొచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్
  • దేశంలో మూడుకి చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Omicron: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు-గుజరాత్‌లో గుర్తింపు-మూడుకి చేరిన కేసుల సంఖ్య

Third Omicron case in India: భారత్‌లో మరో ఒమిక్రాన్ (Omicron) కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి గుజరాత్‌లోని జామానగర్‌కు వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లుగా నిర్దారణ అయింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3కి చేరింది. ఇంతకుముందు, బెంగళూరులో (Bengaluru) రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

ఒమిక్రాన్ బారినపడిన ఆ గుజరాత్ వ్యక్తి (72) రెండు రోజుల క్రితం జింబాబ్వే నుంచి దక్షిణాఫ్రికా (Southafrica) మీదుగా భారత్ చేరుకున్నాడు. జామానగర్‌ ఎయిర్‌పోర్టులో వైద్య పరీక్షలు నిర్వహించడంతో అతనికి కరోనా పాజిటివ్‌గా (Coronavirus Positive) తేలింది. దీంతో అతని శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా... ఒమిక్రాన్ బారినపడినట్లు నిర్దారణ అయింది. అతని కాంటాక్టుల్లో 10 మందిని గుర్తించి ఇప్పటికే క్వారెంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి జామానగర్‌లోని ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఒమిక్రాన్ (Omicron) బారినపడిన వ్యక్తి చికిత్స పొందుతున్న ప్రాంతంలో మైక్రో కంటైన్‌మెంట్ జోన్‌ ఏర్పాటు చేసినట్లు గుజరాత్ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో అందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. 

ఇంతకుముందు, బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు (Omicron cases in India) బయటపడగా.. ఇందులో ఒకరు 46 ఏళ్ల వైద్యుడు కాగా, మరొకరు 66 ఏళ్ల వృద్దుడు. ఒమిక్రాన్ బారినపడిన ఆ వైద్యుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ అతను ఒమిక్రాన్ బారినపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం అతను జ్వరం, ఒళ్లు నొప్పులు, తదితర లక్షణాలతో బాధపడుతున్నాడు. ఇక 66 ఏళ్ల వృద్దుడు ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి రాగా కరోనా టెస్టుల్లో అతనికి పాజిటివ్‌గా తేలింది. జీనోమ్ సీక్వెన్స్‌ రిపోర్టులో అతను ఒమిక్రాన్ (Omicron)  బారినపడినట్లు నిర్దారణ అయింది. ఒమిక్రాన్ తీవ్రత ఇప్పటికైతే కచ్చితమైన సమాచారమేమీ లేదు. అది ప్రాణాంతకమా కాదా అన్నది కూడా ఇంకా తేలలేదు. అయితే డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. 

Also Read: Karnataka Corona rules: కరోనా టీకా తీసుకున్న వారికే మాల్స్​లోకి ఎంట్రీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News