న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, నేడు ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను, గాయపడిన బాధిత కుటుంబాలను, తీవ్రమైన హింస జరిగిన ప్రాంతాలను సందర్శించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి పరిస్థితిని కూస్తుంటే చాలా బాధగా ఉందని, అల్లర్ల సమయంలో సంయమనం పాటించి ప్రాణాలను కాపాడిన వారిని అభినందించారు. సంఘవ్యతిరేక శక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా, అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో(భజన్ పుర) పర్యటించారు. అల్లర్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పలు ప్రాంతాల్లో ఆయన కాలినడకన తిరిగారు. బాధితులను కలిసి వారిని పరామర్శించారు. ఢిల్లీ ప్రజలను ఈ స్థితిలో చూడడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లర్ల కారణంగా అన్నీ రకాలుగా నష్టపోయిన ప్రజలను సాధారణ స్థితికి తీసుకువచ్చే బాధ్యత మనందరిపైనా ఉందని ఆయన గుర్తుచేశారు. 


ఢిల్లీ అల్లర్లలో గాయపడినవారిని చుట్టూ ప్రక్కలవారు ఒకరినొకరు దోహదం చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. దీని ద్వారా సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని వారి సేవలను కొనియాడారు. పౌర సత్వ సవరణ చట్టానికి వ్యతిరేక నిరసనలు హింసాత్మక రూపుదాల్చడంతో క్రమేపి ఈశాన్య ఢిల్లీలో సీఏఏ అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో దాదాపు 35 మందికి పైగా మరణించారు. తీవ్రస్థాయిలో ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..