Coronavirus new strain: ఢిల్లీలో ఆ రాష్ట్రాల ప్రజలకు నో ఎంట్రీ, నెగెటివ్ రిపోర్ట్ చూపిస్తేనే ఎంట్రీ
Coronavirus new strain: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ అధికమైంది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా..కరోనా కొత్త స్ట్రెయిన్ ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపధ్యంలో ఆ ఐదు రాష్ట్రాల ప్రజలకు దేశ రాజధాని నో అంటోంది.
Coronavirus new strain: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ అధికమైంది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా..కరోనా కొత్త స్ట్రెయిన్ ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపధ్యంలో ఆ ఐదు రాష్ట్రాల ప్రజలకు దేశ రాజధాని నో అంటోంది.
కరోనా కొత్త స్ట్రెయిన్(Coronavirus new strain)కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నట్టే..దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి తలెత్తుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ కేసులు పెరిగిపోతున్నాయి. దాంతో ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆంక్షలు విధిస్తున్నాయి. కర్నాటక, తెలంగాణ(Telangana),తమిళనాడు( Tamilnadu), ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఇప్పుడు ఢిల్లీ ( Delhi ) తం ఈ రాష్ట్రాలవారికి ఆంక్షలు విధించింది.
ముఖ్యంగా మహారాష్ట్ర( Maharashtra), కేరళ( Kerala), ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ నుంచి విమానాలు, రైళ్లలో వచ్చే వారికి నిబంధనను అమలు చేయనున్నారు. ఆ రాష్ట్రాల నుంచి ఎవరైనా ఢిల్లీ రావాలనుకుంటే.. ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్( RTPCR Test) రిపోర్టును చూపిస్తేనే అనుమతించేలా నిబంధన పెడుతున్నారు. ఈ కొత్త నిబంధన శుక్రవారం నుంచి అంటే ఫిబ్రవరి26 నుంచి అమలు కానుందని తెలుస్తోంది. మార్చ్ 15 వరకూ కొత్త నిబంధన అమల్లో ఉండనుంది. దీనిపై అధికారిక ఉత్తర్వులు ఇవాళ వెలువడనున్నాయి. వారంలో రోజులుగా దేశంలో నమోదవుతున్న కేసుల్లో 86 శాతం కేసులు ఈ ఐదు రాష్ట్రాల నుంచే వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ విమానం ఎక్కేముందు ప్రయాణికులు టెస్టు చేయించుకున్న రిపోర్టును ఆయా రాష్ట్రాల అధికారులే పరిశీలించనున్నారు.
Also read: Mamata Banerjee: మోదీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డ మమతా బెనర్జీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook