Delta plus Variant: కరోనా కధ ఇంకా ముగియలేదు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నుంచి కోలుకోకముందే అత్యంత ప్రమాదకర వేరియంట్ ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో హడలెత్తిస్తోంది. ఆ వేరియంట్‌పై వస్తున్న నివేదికలు ఆందోళన కల్గిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) నుంచి కోలుకోకముందే కరోనా థర్డ్‌వేవ్ ముప్పు భయపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ప్రమాదకరమైన వార్త ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో ప్రజల్ని భయపెడుతోంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి, మరణాలకు కారణమైన డెల్టా వేరియంట్(Delta Variant).. డెల్టా ప్లస్ వేరియంట్‌గా రూపాంతరం చెందడం. ఇప్పటికే యూకే, అమెరికాల్లో డెల్టా ప్లస్ వేరియంట్‌ను గుర్తించారు. డెల్టా వేరియంట్ కంటే డెల్టా ప్లస్ వేరియంట్ చాలా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరించిన పరిస్థితి. ఇప్పుడు ఇండియాలో నాలుగు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ గుర్తించడం ఆందోళన కల్గిస్తోంది. 


ఇండియాలో మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్(Delta Plus Variant) విస్తరించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 21 కేసుల్ని గుర్తించినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.ఈ వేరియంట్‌తోనే థర్డ్‌వేవ్ పొంచి ఉందని ఆరోగ్య శాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఇక కేరళలో మూడు, కర్ణాటకలో 2, మధ్యప్రదేశ్‌లో 1 కేసు బయటపడ్డాయి. డెల్టా ప్లస్ వేరియంట్ ..ఏకంగా మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ మందును సైతం ఏమారుస్తుందనే నివేదికలు మరీ భయపెడుతున్నాయి.


Also read: Defamation Case: మాజీ ప్రధాని దెవెగౌడకు షాక్, బారీ జరిమానా విధించిన బెంగళూరు కోర్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook