Delta Plus variant of Covid-19: కరోనా వైరస్ ఏ సమయంలో ఎలా పరివర్తన చెందుతుందో తెలియకుండానే కోవిడ్19 మరో వేవ్ అని ప్రచారం చేయడం సరికాదని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. కొత్త వేరియంట్స్ డెల్టా మరియు డెల్టా ప్లస్ కోవిడ్19 వేరియంట్ గురించి శాస్త్రీయ వివరాలు లేనప్పటికీ అది వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని నిర్ధారణకు రావడం మంచిది కాదన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ పీటీఐతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కోవిడ్19 పాజిటివ్ కేసులు, జరుగుతున్న కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ రేటు, కరోనా వైరస్ మ్యూటేషన్ లాంటి పలు అంశాలపై కరోనా కొత్త వేవ్ ఆధారపడి ఉంటుందని వీకే పాల్ తెలిపారు. కరోనా వైరస్ ప్రవర్తన, పరివర్తనను అంత సులువగా గుర్తించలేము కనుక పరిస్థితి ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదన్నారు. డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్ (Delta Variant of Covid-19) ద్వారా కరోనా కొత్త వేవ్ వస్తుందా లేదా అనేది మనం తీసుకునే జాగ్రత్తలు, పాటించే కోవిడ్19 నిబంధనలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 4 లక్షల నుంచి నేడు 50 వేలకు సైతం దిగొచ్చాయని గుర్తుచేశారు.


Also Read: Benefits Of Carrots: కోవిడ్19 సమయంలో క్యారెట్ తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు


ఇండియాలో ప్రస్తుతం భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ (Covaxin), సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్, రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ గురించి మాట్లాడుతూ.. దానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. కనుక కొత్త వేవ్‌కు డెల్టా లేదా డెల్టా ప్లస్ వేరియంగ్ కారణం అవుతుందని చెప్పడానికి ప్రామాణికత లేదన్నారు. డెల్టా నుంచి డెల్టా ప్లస్ వేరియంట్ పుట్టుకొచ్చినా.. డెల్టా వేరియంట్ గురించి పూర్తి స్థాయిలో సైంటిఫిక్ ఆధారాలు లేవని పేర్కొన్నారు. 


Also Read: Vitamin D Benefits: విటమిన్ డి లోపం ఉన్నవారిలో కోవిడ్19 మరణాలు అధికం, సర్వేలో వెల్లడి


కేవలం డెల్టా ప్లస్ వేరియంట్ గురించి జాగ్రత్త పడాలని మాత్రమే సూచించినట్లు చెప్పారు. గత నెలలో కోవిషీల్డ్ తొలి టీకా నుంచి రెండో డోసు మధ్య అంతరం 6-8 వారాల నుంచి 12-16 వారాలకు కేంద్రం పెంచడం తెలిసిందే. శాస్త్రీయ సమాచారం పరిశీలించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం డోసుల మధ్య అంతరానికి సమయాన్ని నిర్ణయించినట్లు వీకే పాల్ స్పష్టం చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook