Vitamin D Benefits: విటమిన్ డి లోపం ఉన్నవారిలో కోవిడ్19 మరణాలు అధికం, సర్వేలో వెల్లడి

Benefits Of Vitamin D: కోవిడ్19 సోకక ముందు విటమిన్ డి తక్కువగా ఉన్నవారిలో 26 శాతం కరోనా మరణాలు సంభవించాయని, ఈ విటమిన్ అధికంగా ఉన్నవారిలో కేవలం 3 శాతం మరణాలు నమోదయ్యాయని ఇజ్రాయెల్ అధ్యయనంలో తేలింది.  అంటే విటమిన్ డి తక్కువగా ఉన్నవారిలోనే కరోణా మరణాలు 20 శాతం అధికంగా సంభవించాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 27, 2021, 04:56 PM IST
  • విటమిన్ డి లోపం ఉన్నవారిలో కరోనా మరణాలు అధికంగా నమోదు
  • తాజాగా ఈ విషయాన్ని ఇజ్రాయెల్ నిపుణుల టీమ్ వెల్లడించింది
  • విటమిన్ డి అధికంగా ఉంటే కరోనాతో పోరాడే శక్తి కాస్త అధికంగా ఉంటుంది
Vitamin D Benefits: విటమిన్ డి లోపం ఉన్నవారిలో కోవిడ్19 మరణాలు అధికం, సర్వేలో వెల్లడి

Benefits Of Vitamin D: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి విటమిన్-Dకి సంబంధం ఉందని మరోసారి రుజువైంది. ఇజ్రాయెల్ నిపుణుల తాజా అధ్యయనంలో  కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. విటమిన్ డి అధికంగా ఉన్నవారు కరోనాతో పోరాడే సామర్థ్యం అధికంగా కలిగి ఉంటారు. కరోనా సోకిన వారిలోనూ విటమిన్ డి మోతాదు తక్కువగా ఉన్నవారే అధికంగా చనిపోయారని MedRxiv అధ్యయనంలో తేలింది. ఈ విషయాన్ని ద జెరూసలెం పోస్ట్ రిపోర్ట్ చేసింది.

కోవిడ్19 సోకక ముందు విటమిన్ డి 20 ng/mL ఉన్నవారిలో 26 శాతం కరోనా మరణాలు సంభవించాయని, ఈ విటమిన్ అధికంగా ఉన్నవారిలో కేవలం 3 శాతం మరణాలు నమోదయ్యాయని ఇజ్రాయెల్ అధ్యయనంలో తేలింది.  అంటే విటమిన్ డి తక్కువగా ఉన్నవారిలోనే కరోనా (COVID-19) మరణాలు 20 శాతం అధికంగా సంభవించాయి. ఇజ్రాయెల్ నహారియాలోని గెలిలీ మెడికల్ సెంటర్‌లోని ఎండోక్రినాలజీ అండ్ డయాబెటిస్ యూనిట్ డైరెక్టర్ అమిర్ బాస్కిన్ ఈ విషయాలు వెల్లడించారు. ప్రతిరోజూ మనకు 1200 మిల్లీగ్రాముల విటమిన్ డి అవసరమని, తక్కువగా ఉన్నవారు కచ్చితంగా వైద్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు సూచనలు తీసుకోవాలని సూచించారు. అబ్రియోలి ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ బార్ ఇలాన్ యూనివర్సిటీ సైతం కొన్ని విషయాలు గుర్తించింది. 

Also Read: Mann Ki Baat: నేను, నా తల్లి కరోనా టీకాలు తీసుకున్నామంటూ PM Modi పలు కీలక విషయాలు

విటమిన్ డి ప్రయోజనాలు (Benefits Of Vitamin D)
శరీరానికి కావలసిన కాల్షియం మరియు పాస్ఫరస్ తీసుకోవడంలో విటమిన్ డి దోహదం చేస్తుంది. తద్వారా మీ ఎముకులు దృఢంగా మారతాయి. ఈ విటమిన్ లోపం కారణంగా చిన్నపిల్లలలో రికెట్స్ సమస్య తలెత్తుతుంది. పెద్దవారిలో ఆస్టియోమలేసియా మరియు ఆస్టియోప్రోసిస్ లాంటి సమస్యలు వస్తాయి. నరాలు, మెదడు, రోగనిరోధక శక్తి వ్యవస్థను విటమిన్ డి పునరుత్తేజితం చేస్తుంది. విటమిన్ డి తక్కువగా ఉన్నవారిలో సైటోకెన్స్, ఆపై న్యూమోనియా, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని అధ్యయనంలో గుర్తించారు. 

Also Read: Delta Variant of Covid-19: రోగ నిరోధకశక్తికి అందని డెల్టా వేరియంట్, అధ్యయనంలో షాకింగ్ విషయాలు

స్థూలకాయం (Obesity), డయాబెటిస్ (Diabetes) సమస్యలున్న వారిలో Vitamin D లోపం ఉంటుంది. ఈ రెండు అనారోగ్య సమస్యలు ఉన్నవారిలోనే కోవిడ్19 కేసులు అధికంగా గుర్తిస్తున్నారు. మరణాల సంఖ్య సైతం వీరిలోనే అధికంగా ఉంది. నరాల బలహీనత, నరాల నొప్పి, వాతం, ఒళ్లునొప్పులు, డిప్రెషన్ లాంటి లక్షణాలు ఉన్నవారిలో విటమిన్ డి లోపం అధికంగా కనిపిస్తోంది.

విటమిన్ డి ఎలా లభిస్తుంది (Sources Of Vitamin D)
విటమిన్-Dకి సూర్యరశ్మి మూలాధారమని చెప్పవచ్చు. అందువల్ల విటమిన్-Dని ద సన్‌షైన్ విటమిన్ అని పిలుస్తారు. మీ శరీరానికి సూర్యరశ్మి తగిలిలా ఉన్నప్పుడు మీకు విటమిన్ డి సహజసిద్ధంగా లభిస్తుంది. సాలమన్ చేపలు, హెర్రింగ్ మరియు మాకెరెల్ లాంటి చేపలను (Benefits Of Fish), పుట్టగొడుగులు, గుడ్డ పచ్చసోన లాంటివి తినడం ద్వారా విటమిన్ డి మీ శరీరానికి అందుతుంది. 

Also Read: COVID-19 Delta Variant: 85 దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు నమోదు, WHO వార్నింగ్

గమనిక: విటమిన్ డి సైతం అవసరమైన మోతాదులో మాత్రమే శరీరానికి తీసుకోవాలి. విటమిన్ డి మరీ అధికమైతే హైపర్‌విటమినోసిస్ డి లాంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ విటమిన్ మరీ అధికంగా ఉంటే వాంతులు, బలహీనత, తరుచుగా మూత్రం, మూత్రపిండాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ డి కోసం ఏవైనా మెడిసిన్ తీసుకోవటానికి ముందు వైద్యులను సంప్రదించి, వారి సలహా తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News