Mother throws her 4 years old daughter from 4th floor in Bengaluru: ఈ సృష్టిలో తల్లి ప్రేమకు మించింది మరొకటి లేదు. ఏ బంధంలో అయినా స్వార్ధం, స్వలాభం ఉంటాయేమో కానీ.. అమ్మ ప్రేమ మాత్రం అందుకు అతీతం. నవ మాసాలు మోసిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తాను తిన్నా.. తినకపోయినా బిడ్డకు మాత్రం మూడు పూటలా భోజనం పెడుతుంది. ఇక కన్న బిడ్డకు చిన్న దెబ్బ తాకినా అల్లాడిపోతోంది. అలాంటి 'తల్లి' పేరుకే కళంకం తెచ్చింది ఓ మహిళ. ఓ తల్లి తన కడుపున పుట్టిన బిడ్డను ఏకంగా 4వ అంతస్తు నుంచి విసిరేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరులోని ఎస్‌ఆర్‌ నగర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... డెంటిస్ట్ అయిన సుష్మా భరద్వాజ్ తన భర్తతో కలిసి అపార్ట్‌మెంట్‌లోని నాలుగు అంతస్తులో ఉంటోంది. సుష్మాకు నాలుగేళ్ల కూతురు దృతి ఉంది. తన బిడ్డకు నాలుగేళ్ల వయసు వచ్చేసరికి కూడా మాటలు రాకపోవడం, చెవులు కూడా వినబడకపోవడంతో ఆమె మానసిక ఒత్తిడికి గురైంది. దృతిని వదిలించుకోవాలని ఓసారి రైల్వే స్టేషన్‌లో వదిలేసి వచ్చింది. సుష్మా భర్త స్టేషన్‌కు వెళ్లి తీసుకొచ్చాడు. 


శుక్రవారం సుష్మా తన కూతురిని చంపేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బాల్కనీలోకి దృతిని ఎత్తుకుని వచ్చిన సుష్మా.. కింద ఎవరైనా ఉన్నారా అని చూసింది. కాసేపటికి ఇంట్లోకి వెళ్లిన సుష్మా.. కూతురుకి నడిపించుకుంటూ వచ్చింది. ఎవరూ లేని సమయం చూసి.. పాపను ఎత్తుకుని రెయిలింగ్‌పై కూర్చోపెట్టి పడేయడానికి ప్రయత్నించింది. వెనక్కి తీసుకుని ఎత్తుకున్న ఆమె.. కాపేటికి బిడ్డను కిందకు విసిరేసింది. దాంతో చిన్నారి అక్కడిక్కడే మరణించింది. ఆపై సుష్మా రెయిలింగ్‌ ఎక్కి దూకడానికి ప్రయత్నించి.. ఆగిపోయింది. ఇది చూసిన వారు ఆమెను కిందకు దించారు. 


సుష్మా భరద్వాజ్ మానసిక పరిస్థితి బాగాలేకపోడంతోనే ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్‌ చేశామని చెప్పారు. సుష్మా ఒక డెంటిస్ట్‌‌గా విధులు నిర్వహిస్తుందని, భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌‌ అని పొలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన అందరూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: కల్యాణ్‌ రామ్ అన్నా.. రాజుగా నిన్ను ఎవరూ భర్తీ చేయలేరు! బింబిసారపై ఎన్టీఆర్‌ రివ్యూ


Also Read: Special Yog On Monday: ఆగస్టు 8న పుత్రదా ఏకాదశి.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook