Deogarh Ropeway Accident Video: దేవఘర్ రోప్‌వే ప్రమాదం ఘటన దేశవ్యాప్తంగా ఉలికిపాటుకు గురిచేసింది. నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఒళ్లు గగుర్పాటు కల్గించే ఆ దృశ్యాలు మీకోసం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జార్ఘండ్ రాష్ట్రంలోని దేవఘర్‌లో జరిగిన రోప్‌వే ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు 45 గంటల సుదీర్ఘ రెస్యూ ఆపరేషన్ ముగిసింది. నలుగురు ప్రాణాలు కోల్పోగా..45 మంది కాపాడగలిగారు. ఈ ప్రమాదానికి కొద్ది సెకన్ల ముందు అదే రోప్‌వే వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో దృశ్యం మరీ భయపెడుతోంది. ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలో చిక్కుకున్నవారికి ఎలా కేకలు పెట్టారనేది ఈ వీడియోలో రికార్డైంది.



ఈ వీడియోను కేబుల్ కార్‌పై ఉన్న ఓ యాత్రికుడు తీసినట్టు తెలుస్తోంది. ఆ పర్యాటకుడు కేబుల్ కారుపై ప్రయాణిస్తూ..తన మొబైల్ కెమేరాలో అక్కడి కొండలు, ప్రకృతి దృశ్యాల్ని రికార్డు చేస్తున్నాడు. ఈలోగా ఈ ప్రమాదం జరిగింది. వీడియోలో జనం పెడుతున్న కేకలన్నీ రికార్డయ్యాయి. 1 నిమిషం 18 సెకన్లున్న ఈ వీడియోలో 42 సెకన్ల వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 


45 గంటలపాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్


దేవఘర్‌లోని త్రికూట పర్వతంపై ఏప్రిల్ 10 వతేదీన రోప్‌వే కేబుల్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఒక ట్రాలీలో ప్రయాణిస్తున్న 60 మంది ఎటూ కాకుండా మధ్యలో వేలాడుతున్న ట్రాలీలో చిక్కుకుపోయారు. వీరి ప్రాణాలు కాపాడే సుదీర్ఘ ప్రయత్నం ప్రారంభమైంది. ప్రారంభంలో స్థానికుల సహాయంతో 20 మందిని కాపాడారు. ఇంకా 40-45 మంది చిక్కుకుపోయారు. ఆ తరువాత ఎన్డీఆర్ఎఫ్, ఐడీబీపీ, ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, స్థానిక పోలీసులు రంగంలో దిగారు.హెలీకాప్టర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మొదటి రోజు 32 మందిని కాపాడారు. ఇందులో ఇద్దరు చనిపోయారు. మరో వ్యక్తి రెస్క్యూ సందర్భంగా పైనుంచి కిందకు పడి మరణించాడు. రెండవ రోజు మంచు కారమంగా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యంగా ప్రారంభమైంది. మొత్తానికి మరో 13 మందిని కాపాడారు. రెస్క్యూ సమయంలో ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయి. 


Also read: New Ticket Booking Rules: టికెట్ బుకింగ్‌లో కొత్త మార్పులు, ఇప్పుడది అవసరం లేదట


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook