Call Forwarding Scam: కాల్ ఫార్వర్డ్ స్కామ్ అంటే ఏమిటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Call Forwarding Scam: ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఫేక్ కాల్స్‌తో ఎక్కౌంట్లు లూటి చేయడం సర్వ సాధారణమైపోతోంది. మోసాలు కూడా వివిధ రకాలుగా ఉంటున్నాయి. కొత్త తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి. అందుకే డీపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ కూడా అలర్ట్ జారీ చేసింది.
Call Forwarding Scam: మీకు తెలియకుండా మీ ఫోన్ కాల్ ఫార్వడ్ అయి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు సెట్టింగ్స్ పరిశీలించుకోండి. ఎందుకంటే మోసాలు కొత్త కొత్త రకాల్లో ఉంటున్నాయి. కాల్ ఫార్వర్డింగ్ అనేది మరో పద్ధతి. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ సైతం ఈ విషయంపై అప్రమత్తం చేస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు.
రోజురోజుకూ కొత్త తరహా మోసాలు పెరుగుతుండటంతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు స్వీకరించడం కూడా ప్రమాదం కావచ్చు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ ఇదే హెచ్చరిస్తోంది. తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్లను రిసీవ్ చేయవద్దని కోరుతోంది. ముఖ్యంగా Star 401 Hashtag నెంబర్‌ను పూర్తిగా ఎవాయిడ్ చేయాలంటోంది. లేకపోతే మీకు వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్ అన్నీ మోసగాళ్లుకు చేరిపోతుంటాయి. అంటే మీకు తెలియకుండానే మీ నెంబర్ కాల్ ఫార్వార్డ్ అయి మోసగాళ్లకు వెళ్లిపోతుంటుంది. Star 401 Hashtag డయల్ చేసి తెలియని నెంబర్‌కు కాల్ చేస్తే మీ కాల్స్ అన్నీమరొకరికి చేరిపోతాయి. మీకు తెలియని వ్యక్తి నెంబర్‌కు మీ కాల్స్ ఫార్వర్డ్ అయిపోతాయి. ఇదే కాల్ ఫార్వర్డింగ్ స్కామ్. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగిపోతున్నాయి.
అందుకే ఈ తరహా ఇన్‌కమింగ్ కాల్స్‌కు దూరంగా ఉండాలని టెలీకమ్యూనికేషన్స్ శాఖ హెచ్చరిస్తోంది. ఎందుకంటే ఈ తరహా కాల్స్ వచ్చినప్పుడు Star 401 Hashtagకు డయల్ చేయమని కోరుతుంటారు. తమను తాము కస్టమర్ సపోర్ట్ లేదా టెక్నికల్ సపోర్ట్ లేదా టెలీకం సర్వీ స్ ప్రొవైడర్ ఇలా ఏదోపేరు చెప్పి Star 401 Hashtag ఇలా డయల్ చేయమని చెబుతుంటారు. సిమ్ కాార్డ్ లేదా నెట్‌వర్క్ సమస్య ఉందని చెబుతారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే వాళ్లు చెప్పింది డయల్ చేయమని చెబుతుంటారు. మీరేమాత్రం పొరపాటున ఇలా చేశారో..అంతే కాల్ ఫార్వర్డింగ్ మీకు తెలియకుండా మీ ఫోన్‌లో ఆన్ అయిపోతుంది. అంతే మీకొచ్చే ఫోన్లు అన్నీ ఆ స్కామర్‌కు వెళ్లిపోతుంటాయి. ఫలితంగా మీ డేటా మొత్తం వారికి చేరుతుంది.
అందుకే ఎప్పటికప్పుడు మీ ఫోన్‌లో కాల్ ఫార్వర్డింగ్ ఏ స్థితిలో ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ ఆన్‌లో ఉంటే ఆఫ్ చేసుకోండి.
Also read: Zee News-Matrize Survey: ఏపీలో ఈసారి అధికారం ఆ పార్టీదే, సంచలన సర్వే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook