Ranjit Singh murder case: డేరా సచ్చా సౌదా నిర్వాహకుడు, వివాదాస్పద మతగురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌(Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh)కు జీవిత ఖైదు పడింది. 2002లో హత్యకు గురైన డేరా సౌదా మేనేజర్‌ రంజిత్ సింగ్ కేసు(Ranjit Singh Case)లో ఈ బాబా పాత్ర ఉన్నట్లు హరియాణాలోని పంచకులలోని సీబీఐ న్యాయస్థానం(CBI Court) ఇది వరకే పేర్కొంది. ఆయనతో పాటు మరో నలుగురికి ఈ హత్యకేసులో  ప్రమేయం ఉన్నట్లు తేల్చిన కోర్టు.. సోమవారం శిక్షను ఖరారు చేసింది. ఆ నలుగురికి కూడా జీవిత ఖైదు(life imprisonment) విధిస్తూ తీర్పు వెలువరించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Punjab Politics: నవజ్యోత్ సిద్ధూ కుమార్తె రబియా పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు


డేరా బాబా రూ.31లక్షలు, మిగతా నలుగురు లక్షన్నర నుంచి 75 వేల రూపాయల వరకు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తంలో కొంత భాగం రంజిత్ కుటుంబానికి వెళ్లనుంది. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరో నిందితుడు ఇదివరకే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం డేరా బాబా సునారియా జైలులో ఉన్నారు. 


రంజిత్‌ సింగ్‌ 2002లో హత్య(Murder)కు గురయ్యారు. ఈ కేసును 2003లో సీబీఐకి అప్పగించారు. డేరా ఆశ్రమంలో మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపుల(Sexual harassment)ను పేర్కొంటూ విడుదలైన ఓ లేఖ అప్పట్లో కలకలం రేపింది. అయితే, అది ఆశ్రమ మేనేజర్‌గా ఉన్న రంజిత్‌ సింగ్‌ రాసినట్లు డేరా బాబా అనుమానించారు. దీంతో ఆయనను హత్య చేసేందుకు డేరా బాబా కుట్రపన్నినట్లు సీబీఐ ఛార్జిషీటు నమోదు చేసింది. ఆ హత్యకేసులో భాగస్తులైన వారిని ఇటీవల దోషులుగా తేల్చి, ఈ రోజు శిక్ష ఖరారు చేసింది. డేరా బాబా ఓ అత్యాచార కేసులో 2017 నుంచి శిక్ష అనుభవిస్తోన్న సంగతి తెలిసిందే. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి