Lakhimpur Kheri violence: నిర్బంధంలో ప్రియాంక.. చీపురు పట్టి ఊడ్చిన వీడియో వైరల్
లఖీంపూర్‌ఖేరీ సందర్శించటానికి వెళ్తున్న ప్రియాంకాగాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు, నిరసనగా స్టేషన్ లో ఆమె ఉంటున్న రూమ్ ను చీపురు పట్టి ఊడ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది
Lakhimpur Kheri violence: కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi Vadra) పోలీస్ స్టేషన్‌లో చీపురు పట్టారు, తను ఉన్న గదిని తానే ఊడ్చుతూ నిరసన వ్యక్తం చేశారు. రాత్రి లఖీంపూర్‌ఖేరీ (Lakhimpur Kheri) వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని సీతాపూర్ స్టేషన్ (Seetapoor Station)కు తరలించారు. ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ ఓ జరిగిన ఘటన బాధితులను ఓదార్చటానికి మాత్రమే వెళ్తున్నానని.. ఇందులో ఏం నేరం ఉందని ప్రియాంక పోలీసులతో వాగ్వాదానికి దిగారు
దీని కన్నా ముందు, ఉత్తరప్రదేశ్‌లో లఖీంపూర్ ఖేరీని సందర్శించడానికి వెళ్తున్న ప్రియాంకను గృహ నిర్బంధంలో ఉంచారు పోలీసుల. కానీ ఆమె దాటుకొని వెళ్లటంతో హరగావ్‌లో (Haragaon)పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: Aryan Khan Arrest: 'నా కొడుకు ఏదైనా చేయొచ్చు'.. షారుక్ ఖాన్ ఇంటర్వ్యూ వీడియో వైరల్
లఖింపూర్ ఖేరీను (Lakhimpur Kheri) సందర్శించాలని ప్రియాంక లక్నో లోని స్వగృహం నుండి ఉదయం బయల్దేరగా ... పోలీసులు ఆమెను అడుగడుగా అడ్డుకున్నారు. ఉద్రిక్తల కారణంగా అక్కడికి వెళ్లే అనుమతి లేదని పోలీసులు తెలపటంతో, ప్రియాంక బాధితుల కోసం కాలినడకన బయల్దేరారు. లఖింపూర్ ఖేరికి వెళ్లే మార్గంలో హరగావ్ టోల్ ప్లాజా వద్ద అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు.
లఖీంపూర్‌ఖేరీ బాధితులను కలిసి, వారి బాధను తెలుసుకోవటం తప్పు కాదని, ఇంటికి నుండి బయటకి వస్తే తప్పేంటి అని వెల్లడించారు. "నేను ఏదైనా తప్పు చేస్తే వారెంట్ లేదా ఆర్డర్ చూపించి కారు ఆపాలని మరియు బాధిత కుటుంబాలను ఓదార్చటంలో తప్పేముంది" అని ప్రియాంకాగాంధీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
Also Read: Hero Ram Pothineni Injured: గాయపడ్డ హీరో 'రామ్ పోతీనేని'...'రాపో19' షూటింగ్ కు బ్రేక్!
లఖింపూర్ ఘటన తెలియగానే ప్రియాంక విమానంలో లక్నో చేరుకొని, నేరుగా ఆమె నివాసమైన కౌల్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ పోలీసులు అడ్డుకొని గృహ నిర్బంధంలో ఉంచగా ప్రియాంక అక్కడి నుండి తప్పించుకొని ఉదయాన లఖింపూర్‌కు బయలు దేరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook