Diego Maradona's stolen watch recovered in Assam: దివంగత ఫుట్‌బాల్ లెజెండ్ డీగో మారడోనాకి చెందిన లగ్జరీ వాచీ (Diego Maradona Hublot watch) ఒకటి కొన్ని నెలల క్రితం చోరీకి గురైంది. దుబాయిలో (Dubai) చోరీకి గురైన ఆ వాచీ తాజాగా భారత్‌లోని అసోంలో (Assam) దొరకడం గమనార్హం. వాజీద్ హుస్సేన్ అనే వ్యక్తి దుబాయిలో ఆ వాచీని దొంగలించి భారత్ వచ్చేశాడు. దుబాయి పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకుని విచారణ జరిపారు. ఈ క్రమంలో అసోం పోలీసుల సహకారంతో ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని వాచీని స్వాధీనం చేసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డీగో మారడోనా (Diego Maradona) గౌరవార్థం 2010 ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ (Fifa World Cup) సందర్భంగా ప్రముఖ లగ్జరీ వాచీల తయారీ కంపెనీ హుబ్లట్ స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'మారడోనా బిగ్ బ్యాంగ్ క్రోనోగ్రాఫ్' పేరిట 250 వాచీలను విడుదల చేసింది. ఈ వాచీలపై మారడోనా సంతకంతో పాటు వెనుక వైపు మారడోనా విక్టరీ సింబల్ ఉంటుంది. ఒక్కో వాచీ ధర రూ.20లక్షలు పైనే ఉంటుంది. వీటిల్లో రెండు వాచీలను మారడోనాకు బహుమతిగా ఇచ్చిన ఆ సంస్థ... మిగతా వాటిని అమ్మేసింది. అప్పట్లో ఆ వాచీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.


మారడోనా (Diego Maradona) మరణానంతరం ఆయన వస్తువులు కొన్ని దుబాయికి (Dubai) చెందిన ఓ సంస్థ ఆధీనంలో ఉన్నాయి. అందులో మారడోనాకి చెందిన హుబ్లట్ లగ్జరీ వాచీ కూడా ఉంది. ఆ సంస్థలో భారత్‌కు చెందిన వాజీద్ హుస్సేన్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో అతను మారడోనాకి చెందిన లగ్జరీ హుబ్లట్ వాచీని దొంగిలించాడు. ఆ తర్వాత తన తండ్రి ఆరోగ్యం బాగా లేదని చెప్పి అసోం వచ్చేశాడు. హుస్సేన్ అక్కడి నుంచి వచ్చేశాక వాచీ కనిపించకపోవడంతో ఆ సంస్థకు అతనిపై అనుమానం కలిగింది.


అప్పటినుంచి అతని ఆచూకీ కోసం దుబాయి పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో అతను అసోంలో ఉన్నాడని తెలుసుకుని అక్కడి పోలీసుల సహకారం కోరారు. అసోం పోలీసులు రంగంలోకి దిగడంతో శనివారం (డిసెంబర్ 11) తెల్లవారుజామున 4గం. సమయంలో వాజీద్ హుస్సేన్ పట్టుబడ్డాడు. చారైడియో అనే జిల్లాలో అతన్ని అదుపులోకి తీసుకుని మారడోనా వాచీని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు అసోం డీజీపీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.


 



 


Also Read: కోహ్లీకి బీసీసీఐ సరైన గౌరవం ఇవ్వలేదు.. అతడి రికార్డులు ఓసారి చూడండి: కనేరియా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook