Did Not Give Respect to Virat Kohli: Danish Kaneria salms BCCI: యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. నిజానికి టోర్నీ ఆరంభానికి ముందే విరాట్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తాజాగా టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి కూడా అతడిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తప్పించింది. విరాట్ స్థానంలో రోహిత్ శర్మ (Rohit Sharma)ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ తప్పించడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా (Danish Kaneria) స్పందించాడు. కోహ్లీ విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరును అతడు తప్పుబట్టాడు.
దానిష్ కనేరియా (Danish Kaneria) తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీతో బీసీసీఐ సరైన రీతిలోనే వ్యవహరించిందా అంటే?.. లేదని నేను అనుకుంటున్నా. బీసీసీఐ కోహ్లీకి కనీస గౌరవం ఇవ్వలేదు. కెప్టెన్‌గా 65 వన్డేలలో టీమిండియాకు విజయాలు అందించాడు. టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన నాలుగో సారథి. భారత వన్డే కెప్టెన్‌గా (ODI Captain) రెండవ అత్యధిక పరుగులు చేసిన వ్యక్తి కూడా. రికార్డుల పరంగా చూస్తే అతన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ బీసీసీఐ మాత్రం అలా చేయలేదు' అని అన్నాడు.
Also Read: Nathan Lyon: ఒక్క వికెట్ కోసం 326 రోజుల నిరీక్షణ.. చివరకు మూడో బౌలర్‌గా రికార్డు!!
'కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఐసీసీ ట్రోఫీలను గెలవకపోవచ్చు కానీ సారథిగా టీమిండియాను అతను నడిపించిన మార్గం అసాధారణమైనది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఇద్దరు మాత్రమే సూపర్‌స్టార్లు ఉన్నారు. ఒకరు విరాట్ కోహ్లీ (Virat Kohli) కాగా.. మరొకరు బాబర్ అజమ్. మీరు సూపర్‌స్టార్‌లను గౌరవించాలి. కోహ్లీకి తెలియజేయకుండా బీసీసీఐ అతనిని తొలగించడంలో కఠినంగా వ్యవహరించింది. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) గొప్ప వ్యక్తి, మాజీ కెప్టెన్. మేము రోహిత్ శర్మని కెప్టెన్‌గా చేయాలనుకుంటున్నామని విరాట్‌కు ముందే చెప్పాల్సింది. కోహ్లీకి వ్యతిరేకమైన విషయం ఏమిటంటే అతను మునపటిలా పరుగులు చేయడం లేదు' అని పాక్ మాజీ లెగ్ స్పిన్నర్ దానిష్ కనేరియా (Danish Kaneria) పేర్కొన్నాడు.
Also Read: Video: హైదరాబాద్ లో దారుణం.. తలపై నుండి వెళ్లిన లారీ ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి
A leader who led the side with grit, passion & determination. 🇮🇳🔝
Thank you Captain @imVkohli!👏👏#TeamIndia pic.twitter.com/gz7r6KCuWF
— BCCI (@BCCI) December 9, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook