Offline Payments: భారతీయ రిజర్వు బ్యాంక్‌ (Reserve Bank of India) కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలలో డిజిటల్ లావాదేవీలు (Digital Transactions) , ఆన్‌లైన్ సేవలు (Online Services) లేని వారు నగదు బదిలీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ లావాదేవీలు (Offline Payments) వ్యవస్థను అందుబాటులోకి తేనుందని ఆర్‌బీఐ (RBI) ప్రకటించింది. త్వరలో ఇంటర్నెట్ సేవలు లేని ప్రాంతాలలో డిజిటల్ లావాదేవీలు (Digital Transactions) పెంచటం కోసం ఈ వ్యవస్థ ఏర్పడనుంది. దీని కోసం త్వరలో ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ (RBI Governor Dhaktikanta Das) ప్రకటించారు.


Also Read: Konda Polam Movie Review: వైష్ణ‌వ్‌తేజ్ నటించిన 'కొండ పొలం' సినిమా రివ్యూ


గతేడాదిలోనే దీనికి సంబంధించిన పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. బ్యాంకు కార్డులు, మొబైల్‌ ఫోన్ల ద్వారా తక్కువ డబ్బుతో కూడిన లావాదేవీలకు అంగీకారం తెలిపింది. ఈ విధానం ద్వారా గరిష్టంగా 200 రూపాయలు స్వీకరించారు.


ఆర్‌బీఐ ప్రారంభించిన ఈ పైలట్ ప్రాజెక్టులో, బ్యాంకులు, ఇతర సంస్థల ఆఫ్‌లైన్ డిజిటల్‌ (Offline Payments) పేమెంట్లను అనుమతించింది. నెట్‌వర్క్‌ సమస్యలు (Network Issuews), ఇంటర్నెట్ (Internet) అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలలో డిజిటల్ సేవలు (Digital Services)మెరుగవటానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ (RBI) ప్రకటించింది 


Also Read: ChaiSam Divorce: సమంత షాకింగ్ పోస్ట్... ట్రోల్స్ చేస్తున్నవారికి స్ట్రాంగ్ వార్నింగ్.. పోస్ట్ వైరల్


ఈ ఏడాది మార్చి 31 వరకు కొనసాగిన పైలట్ ప్రాజెక్టు మంచి సత్పలితాలను ఇవ్వడటంతో దేశ వ్యాప్తంగా ఈ సేవలను అందించాలని ఆర్‌బీఐ (RBI) నిర్ణయం తీసుకుంది.   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook