Konda Polam Movie Review: వైష్ణ‌వ్‌తేజ్ నటించిన 'కొండ పొలం' సినిమా రివ్యూ

మొదటి సినిమా 'ఉప్పన'తో హిట్ కొట్టిన హీరో వైష్ణ‌వ్‌తేజ్ రెండో సినిమా కొండ పొలం. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టగా..  క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వచించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా... ?

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2021, 03:58 PM IST
  • ఈ రోజే విడుదలైన కొండ పొలం సినిమా
  • నవల ఆధారంగా అడవి నేపథ్యంలో రూపొందిన సినిమా
  • నటనతో మరోసారి ఆకట్టుకున్న హీరో వైష్ణ‌వ్‌తేజ్
Konda Polam Movie Review: వైష్ణ‌వ్‌తేజ్ నటించిన 'కొండ పొలం' సినిమా రివ్యూ

సినిమా: కొండపొలం
విడుద‌ల‌ తేదీ: 08-10-2021
న‌టీన‌టులు: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోట శ్రీనివాసరావు, సాయిచంద్, హేమ, రచ్చ రవి త‌దిత‌రులు
ఛాయాగ్రహ‌ణం: జ్ఞాన శేఖర్ వీఎస్
కథ: సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి 
సంగీతం: ఎంఎం కీరవాణి
నిర్మాత: సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
నిర్మాణ సంస్థ‌: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

Konda Polam Movie Review:స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి రాసిన న‌వ‌ల ఆధారంగా రూపొందిన సినిమా 'కొండ పొలం'. ఉప్పెన సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన హీరో వైష్ణ‌వ్‌తేజ్ నటించిన రెండవ చిత్రం కావటం.. ఈ సినిమాకు భిన్నమైన కథలను ఎంచుకునే క్రిష్ దర్శకత్వం వహించటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. 

కథ:

మారుమూల గ్రామానికి చెందిన వాడు ర‌వీంద్ర‌నాథ్ (వైష్ణ‌వ్‌తేజ్‌). హదరాబాద్ లో నాలుగు సంవత్సరాల పాటు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాడు. తనలోని ఆత్మవిశ్వసం లేకపోవటం బలహీనతగా అనుకునే హీరో ర‌వీంద్ర‌నాథ్ తిరిగి సొంతూరుకి చేరుకుంటాడు. కరువుకాటకాల కారణంగా తండ్రికి సహాయం కోసం గొర్రెల కాపాటం కోసం అడవికి వెళ్తాడు. అక్కడ హీరో అడవి నుండి ఏం నేర్చుకున్నాడు? అతనిలో మార్పులకు గల కారణమేంటి? యూపీఎస్సీలో అర్హత సాదించేంత ఆత్మవిశ్వాసం ఎలా నేర్చుకున్నాడు అనేదే సినిమా.. 

Also Read: MLA Malladi Vishnu: మళ్లీ నోరు జారిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. ఈ సారి భక్తులపై..

సినిమా ఎలా ఉందంటే.. ?? 
గొర్రెల కాపరుల జీవితం ఎలా ఉంటుందో తెరకెక్కించిన ఈ సినిమాలో.. ఆత్మవిశ్వాసమే లేని ఒక వ్యక్తి తల పైకెత్తి చూపించేంత దైర్యం ఎలా సంపాదించాడో అన్నదే కథ. నల్లమల ఆడవిలో సాగే కథలో.... ఒక వ్యక్తి సాహస యాత్ర ఎలా ఉంటుందో, అడవి మరియు ఏ కల్మషం లేని అమ్మాయి ఒక పిరికివాడికి తనపై తనకు ఎలా నమ్మకాన్ని కల్పించారో అన్న నేపథ్యంలో సాగుతుంది. అడవి ప్రయాణం మొదలైనప్పటి నుండి ముందుకు వెళ్లే కొద్దీ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ప్రయాణంలో హీరో ఎదుర్కొనే సవాళ్లు.. ఒక్కో సవాల్ నుండి హీరో ఎలాంటి పాఠం నేర్చుకున్నాడన్నదే సినిమా... అంతేకాకూండా, అడవి గొప్పదనం గురించి మరియు దానిని ఎలా కాపాడుకోవాలనే అంశం గురించి ఈ సినిమా వివరిస్తుంది. 

ఎవరెలా చేశారంటే.. ??
ఉప్పెన సినిమాలో  మత్స్యకార కుటుంబానికి చెందిన యువకుడిగా.. ఈ సినిమాలో మంచి చదువు ఉండి కూడా.. ఆధునిక ప్రపంచంలో పోటీపడలేని యువకుడిగా వైష్ణ‌వ్‌తేజ్ ఒదిగిపోయాడు. తన నటనతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడనటంలో ఎలాంటి సందేహం లేదు. రాయలసీమ మాట తీరు, హీరోయిన్ తో నటించిన సన్నివేశాలు, పులితో పోరాటం వంటి సన్నివేశాలలో వైష్ణ‌వ్‌ అద్భుత నటన కనబరిచాడు. ఇక రకుల్ విషయానికి వస్తే.. గొర్రెల కాపరి వర్గానికి చెందిన గ్రామీణ యువతిగా రకుల్ ప్రీత్ సింగ్ చాలా అద్భుతంగా నటించిందనే చెప్పాలి. ముఖ్యంగా, 'ఆత్మవిశ్వాసం లేని ఒక యువకుడితో పట్టుదల ఏర్పడటానికి పరోక్ష కారణం ఓబులమ్మ' పాత్రలో రకుల్ ఒదిగిపోయింది. మిగిలిన పాత్రల విషయానికి వస్తే రవీంద్ర తండ్రిగా సాయిచంద్.. గొర్రెల కాపరి ఎలా ఉంటాడో అలానే నటించాడు. ఇక కోట శ్రీనివాస్, రవి ప్రకాష్ ఎప్పటిలాగే తమ పాత్రలలో పరకాయ ప్రవేశం చేశారు. కథ, మాటలు. పాటలు సినిమాకి బలం అని చెప్పవచ్చు. కీర‌వాణి  అందించిన నేప‌థ్య సంగీతం బాగుందని చెప్పాలి. కెమెరా మెన్ జ్ఞాన‌శేఖ‌ర్ పని తనం మెప్పించిందనే చెప్పాలి. నవల ఆధారంగా రూపొందించిన సినిమా కాబట్టి, తెర పైన అదే భావాన్ని చూపించటం చాలా కష్టం కానీ దర్శకుడు క్రిష్ ఈ విషయంలో విజయం సాధించారనే చెప్పాలి. కానీ విజువల్ ఎఫెక్ట్ లో ఇంకొంచెం దృష్టి  సారిస్తే బాగుండు అనిపించింది. సినిమా కమర్షియల్ గా ఎంత హాట్ అవుతుందో తెలియదు కానీ, ఒక మంచి సందేశాత్మక సినిమా చూశామని ఫీలింగ్ ప్రేక్షకుడిలో కలుగుతుంది. 

Also Read: ChaiSam Divorce: సమంత షాకింగ్ పోస్ట్... ట్రోల్స్ చేస్తున్నవారికి స్ట్రాంగ్ వార్నింగ్.. పోస్ట్ వైరల్

గమనిక:
రివ్యూ.. సినిమా చూసిన ఒక వ్యక్తి కోణానికి సంబంచినది... ఒక సగటు సినిమా అభిమాని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News