ఆయన ఓ రాష్ట్ర మంత్రి.. ఏదైనా ఒక మాట చెప్పాల్సి వస్తే.. సరిగ్గా ప్రిపేర్ అయి చెప్పాలి.. లేకుంటే ఇదిగో ఇలా అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్.. దిండుకల్‌ జిల్లా వేదసందూర్‌‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి దిండిగల్ మాట్లాడుతూ.. లోక్‌సభ డిప్యూటీ చైర్మన్ తంబిదురై గురించి ప్రస్తావించారు.. ఆ సమయంలో డిప్యూటీ చైర్మన్ అక్కడ లేరు. ఆయన ప్రస్తుతం మరో ప్రాంతంలో ప్రజల సమస్యలు వింటున్నారని..ఇంకాసేపట్లో ఈ ఫంక్షన్‌లో పాల్గొంటారని చెప్పారు. సాయంత్రం పుదుకొట్టై వెళ్లి.. అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరసింహారావుతో మాట్లాడతానని చెప్పారు. దీంతో ఆశ్చర్యపోవడం అక్కడివారి వంతయ్యింది. ఆ సమయంలో అక్కడ ఆరోగ్యశాఖ మంత్రి సి. విజయ్ భాస్కర్ కూడా ఉన్నారు.


ఈ కార్యక్రమం అనంతరం అక్కడి చేరుకున్న తంబిదురై.. మంత్రి దిండికల్ శ్రీనివాసన్‌తో కలిసి సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కూడా లేచి మంత్రి మాట్లాడుతుండగా.. ‘చూసి మాట్లాడండి’ అంటూ తంబిదురై జాగ్రత్త చేశారు.
 
తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం మంత్రి దిండిగల్‌కి ఇది కొత్తేమి కాదు. గతంలోనూ ప్రధాని పేరును మోదీకి బదులు మన్మోహన్‌సింగ్‌ అంటూ వ్యాఖ్యానించారు. భారతరత్న ఎంజీఆర్‌ అని చెప్పడానికి బదులుగా భారత ప్రధాని ఎంజీఆర్‌ అంటూ మాట్లాడారు. ఈసారి కూడా ప్రధాని పేరే మార్చేశారు మంత్రి దిండిగల్.