Tamilnadu politics: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై దుమారం, ఈసీకు బీజేపీ ఫిర్యాదు
Tamilnadu politics: తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ప్రచారంలో ఆరోపణాస్త్రాలు పదునెక్కుతున్నాయి. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉదయనిధిని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది.
Tamilnadu politics: తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. ప్రచారంలో ఆరోపణాస్త్రాలు పదునెక్కుతున్నాయి. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉదయనిధిని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది.
తమిళనాట ఎన్నికల (Tamilnadu Elections) ప్రచారంలో భాగంగా డీఎంకే ఛీఫ్ స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దివంగత బీజేపీ (Bjp)నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలపై ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఒత్తిడి తట్టుకోలేకపోవడంతోనే సుష్మా, జైట్లీ చనిపోయారని ఎన్నికల సభలో ఉదయనిధి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో పోటీకు అనర్హుడిగా ప్రకటించాలని కోరింది. డీఎంకే (DMK) స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.
తమిళనాడులోని చెపాక్-ట్రిప్లికేన్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఉదయనిధి Udaynidhi stalin) సుష్మా స్వరాజ్(Sushma Swaraj), అరుణ్ జైట్లీలతో పాటు మరికొందరు బీజేపీ నేతలపై కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రదాని అవుతారనుకున్న అద్వానీని మోదీ(Modi) పక్కన పెట్టారని..మోదీ వేధింపులు భరించలేక యశ్వంత్ సిన్హా పార్టీ వీడారని ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక సుష్మ, జైట్లీ మరణించారని..సీనియర్ నేత వెంకయ్య నాయుడును కూడా మోదీ పక్కనపెట్టారని ఉదయనిధి తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై సుష్మ కూతురు బాన్సురీ, జైట్లీ కూతురు సొనాలీ స్పందించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తమ తల్లి పేరును వాడుకోవద్దని బాన్సురీ సూచించారు. మా అమ్మ అంటే మోదీకి అమిత గౌరవమని చెప్పారు. అదే విధంగా ప్రధాని మోదీతో అరుణ్‌జైట్లీ ( Arun Jaitley)కి ప్రత్యేక అనుబంధం ఉండేదని సొనాలీ జైట్లీ చెప్పారు.
Also read: Corona Second Wave: భారీగా పెరిగిన కరోనా కేసులు, ఒక్కరోజులో 81 వేల కొత్త కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook