Chennai Airport: హిందీ తెలియకపోతే భారతీయులు కాదా: కణిమొళి ట్వీట్
హిందీ జాతీయ భాష ( Hindi a national language ) . కానీ ఆ అధికారికి అదే ప్రామాణికంగా అన్పించింది. హిందీ రాదని తెలుసుకుని..భారతీయులేనా అని ప్రశ్నించింది. అది కూడా ఓ ఎంపీని పట్టుకుని. తనకెదురైన విచిత్ర అనుభవంపై ఆ ఎంపీ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనమవుతోంది.
హిందీ జాతీయ భాష ( Hindi a national language ) . కానీ ఆ అధికారికి అదే ప్రామాణికంగా అన్పించింది. హిందీ రాదని తెలుసుకుని..భారతీయులేనా అని ప్రశ్నించింది. అది కూడా ఓ ఎంపీని పట్టుకుని. తనకెదురైన విచిత్ర అనుభవంపై ఆ ఎంపీ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనమవుతోంది.
తమిళనాట డీఎంకే పార్టీ ( DMK ) ఎంపీ కణిమొళి ( Mp kanimozhi ) అందరికీ సుపరిచితమే. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి గారాలపట్టి. ఇంతటి ప్రాచుర్యమున్న ఎంపీకు తన రాష్ట్రంలోని చెన్నై ఎయిర్ పోర్ట్ లో విచిత్ర అనుభవం ఎదురైంది. ఢిల్లీకు వెళ్లేందుకు చెన్నై ఎయిర్ పోర్ట్ ( Chennai Airport ) కు చేరుకున్న ఎంపీను.. ఎయిర్ పోర్ట్ లో పనిచేసే ఓ మహిళా సీఐఎస్ఎఫ్ అధికారి ( CISF Officer ) ప్రశ్నించిన తీరు వివాదాస్పదమైంది. తనకెదురైన విచిత్ర అనుభవాన్ని కణిమొళి ట్వీట్ చేయడం సంచలనమైందిప్పుడు. అసలేం జరిగిందంటే…
తనకు హిందీ రాదని..ఇంగ్లీష్ లేదా తమిళంలో మాట్లాడమని చెన్నై విమానాశ్రయంలో ఓ మహిళా అదికారిని ఎంపీ కణిమొళి కోరారు. దానికామె సమాధానంగా...మీరు భారతీయులేనా అని ప్రశ్నించడంతో కణిమొళి అవాక్కయ్యారు. భారతీయులుగా ఉండటమంటే..హిందీ తెలిసుండటమే అర్హతా అనేది తెలుసుకోవాలనుకుంటున్నట్టు కణిమొళి ( Kanimozhi ) ఆమెను ప్రశ్నించారు. తాను ఎవరన్నది మీరు నిర్ణయించలేరని..ఈ విషయంపై ఫిర్యాదు చేయనున్నట్టు కణిమొళి చెప్పారు. Also read: Kerala Flight crash: ఆ రన్ వే సేఫ్ కాదని గతంలోనే హెచ్చరించారా
అనంతరం ఢిల్లీలో ( Delhi ) ల్యాండ్ అవగానే సీఐఎస్ఎఫ్ అధికారులు కణిమొళిని కలిశారు. ఓ ప్రత్యేక భాష గురించి చెప్పడం తమ ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. Also read: Refugee camp: శరణార్ధి కుటుంబంలో 11 మంది మరణం