జాతీయ ఆరోగ్య బీమా పథకం.. ఈ పథకం ద్వారా దేశంలో నిరుపేద ప్రజలకు ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. అయితే ఈ పథకం ఎంత వరకు విజయవంతమయ్యే అవకాశం ఉందన్న విషయంపై మనం కూడా కాస్త విశ్లేషణ చేద్దాం..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

*పది కోట్ల నిరుపేద కుటుంబాలకు బీమా కల్పించే పథకమే జాతీయ ఆరోగ్య బీమా పథకం. ఈ పథకంలో భాగంగా ఏడాదికి కుటుంబానికి రూ.5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తారు. అయితే ఈ పథకాన్ని ఎప్పట్నించి అమలు చేస్తారో జైట్లీ తెలపలేదు. 


*ఈ పథకం ద్వారా దాదాపు 50 కోట్లమంది ప్రజలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలో ఇప్పటి వరకూ ఏ దేశం కూడా ప్రకటించని విధంగా నమోదైన అతి పెద్ద ఆరోగ్య బీమా పథకం ఇదే అవుతుందని జైట్లీ అన్నారు. 


*అయితే అచ్చం ఇలాంటి పథకమే 2016-17 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ కుటుంబానికి లక్ష రూపాయల ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపింది. అయితే తాజా బీమా దానికి ప్రత్యమ్నాయమా అన్న విషయాన్ని కేంద్రం చెప్పలేదు. 


*అచ్చం ఇలాంటి పథకాలే రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుండో అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో  ఎన్టీఆర్‌ వైద్యసేవ పేరిట నడుపుతున్న పథకం లేదా తెలంగాణలో ఆరోగ్యశ్రీ పేరిట నడుపుతున్న పథకం గానీ అలాంటివే కదా..!


*తాజా పథకానికి "ఆయుష్మాన్ భారత్" అని పేరు పెట్టారు. అయితే ఈ పథకంలో భాగంగా ఎలాంటి రోగాలకు ట్రీట్‌మెంట్ లభిస్తుందన్న విషయంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనూ ఇవ్వలేదు. 


*ఈ కొత్త పథకం అమలైతే, ప్రజల పక్షాన దాదాపు సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల ప్రీమియంను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.