ముంబై: కరోనావైరస్ సోకిన వారికి చికిత్స చేస్తూ వారికి ప్రాణాలు పోస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిని అందరం దైవంలా భావిస్తున్నాం. కానీ వారిలోనూ దైవం రూపంలో ఉన్న కామపిశాచాలున్నాయని నిరూపించిన ఘటన ఇది. ముంబైలో కరోనా సోకి ఐసీయూలో చికిత్స పొందుతున్న 44 ఏళ్ళ రోగిపై ఓ డాక్టర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ముంబైలోని వకార్డ్ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. ఏప్రిల్ 30న డ్యూటీలో చేరిన 34 ఏళ్ళ డాక్టర్.. ఆ మరుసటిరోజే ఈ దారుణానికి ఒడిగట్టాడు. కామాంధుడి ప్రవర్తనను చూసి విస్తుపోయిన పేషెంట్ గట్టిగా కేకలు వేసి ఆస్పత్రి సిబ్బందికి జరిగిన విషయాన్ని తెలియజేశారు. రోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే డాక్టర్‌ని విధుల నుంచి తొలగించిన ఆస్పత్పి సిబ్బంది.. పోలీసులకు, బృహత్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులకు సమాచారం అందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపిసి 377, 269, 270 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని హోమ్ క్వారంటైన్‌కి తరలించారు. కరోనా రోగిపై లైంగిక వేధింపులకు పాల్పడినందున అతడికి కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందనే భయంతో అతడిని వెంటనే అరెస్ట్ చేయకుండా హోమ్ క్వారంటైన్‌కి తరలించి అతడిపై నిఘా పెట్టారు. 


క్వారంటైన్ ముగిసిన వెంటనే నిందితుడికి కరోనా నిర్థారణ పరీక్షలు జరిపిన అనంతరం ఫలితాన్నిబట్టి అతడిని అరెస్ట్ చేస్తామని ముంబై పోలీసులు తెలిపారు. బాధితుడు, ఆస్పత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం మే 1న ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.