Doctor dies of COVID-19: కరోనాతో డాక్టర్ మృతి.. ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్
కరోనావైరస్ పాజిటివ్‌తో 69 ఏళ్ల డాక్టర్ చనిపోయిన ఘటన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో చోటుచేసుకుంది. షిల్లాంగ్‌లో బెతానీ ఆస్పత్రి డైరెక్టర్‌గా ఉన్న డా జాన్ సైలో కరోనాతో మృతి చెందగా.. అదే కుటుంబానికి చెందిన మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడం ఆందోళనకు దారితీస్తోంది.
షిల్లాంగ్ : కరోనావైరస్ పాజిటివ్‌తో 69 ఏళ్ల డాక్టర్ చనిపోయిన ఘటన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో చోటుచేసుకుంది. షిల్లాంగ్‌లో బెతానీ ఆస్పత్రి డైరెక్టర్‌గా ఉన్న డా జాన్ సైలో కరోనాతో మృతి చెందగా.. అదే కుటుంబానికి చెందిన మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడం ఆందోళనకు దారితీస్తోంది. మేఘాలయలో తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు అయిన డా జాన్ మృతి పట్ల మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. డా జాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టుగా ట్వీట్ చేసిన సంగ్మ.. డా జాన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
Also read : COVID-19 Hotspots: ఇంటింటి సర్వే.. బ్లడ్ శాంపిల్స్ సేకరణ
డా జాన్‌కి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఎవరో ఒక సైలెంట్ క్యారియర్ ద్వారానే కరోనా వైరస్ డాక్టర్ జాన్‌కి సోకినట్టుగా భావిస్తున్న పోలీసులు.. ప్రస్తుతం ఆ సైలెంట్ క్యారియర్ ఎవరా అని తెలుసుకునే పనిలో పడ్డారు. ఇటీవల కాలంలో డాక్టర్‌ని కలిసిన 2000 పైగా మంది జాబితాను సిద్ధం చేసిన పోలీసులు.. వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. భారత్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 11,933 గా ఉండగా.. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 392గా ఉంది.