Travel History లేని బెంగళూరు వైద్యుడికి ఒమిక్రాన్.. భయాందోళనలో భారత్! ఇంతకీ ఎలా సోకింది?
ఇప్పటికే చాలా దేశాల్లో ఒమిక్రాన్ పంజా విసురుతుండగా.. తాజాగా భారత్‌లోకి ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రంలోనే ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ గురువారం వెల్లడించారు. వైరస్ సోకిన వారిలో ఒకరు విదేశీయుడు కాగా.. మరొకరు బెంగళూరు చెందిన డాక్టర్. అయితే ఒమిక్రాన్ సోకిన వైద్యుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడమే ఇక్కడ గమనార్హం.
Doctor with no travel history among India's first Omicron cases: కరోనా మహమ్మారి కొత్త వేరియెంట్ 'ఒమిక్రాన్' ప్రపంచ దేశాలను భయపెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాల్లో ఒమిక్రాన్ (Omicron) పంజా విసురుతుండగా.. తాజాగా భారత్‌లోకి ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రంలోనే ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ గురువారం వెల్లడించారు. వైరస్ సోకిన వారిలో ఒకరు విదేశీయుడు కాగా.. మరొకరు బెంగళూరు చెందిన డాక్టర్ (Bengaluru Doctor). అయితే ఒమిక్రాన్ సోకిన వైద్యుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడమే ఇక్కడ గమనార్హం. ఇక ఆయనతో కాంటాక్ట్ అయిన వారిలో ఐదుగురికి పాజిటివ్ అని తేలడంతో భారత్ (India) భయాందోళనలకు గురవుతోంది.
బొమ్మనహళ్లి నివాసి అయిన 46 ఏళ్ల వైద్యుడు (Bengaluru Doctor) బన్నేరుఘట్ట రోడ్‌లోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఆ వైద్యుడికి నవంబర్ 22న పాజిటివ్ అని తెలిసింది. జలుబు మరియు శరీర నొప్పులు ఉండడంతో అతడు స్వయంగా కరోనా టెస్ట్ చేసుకున్నాడు. పరీక్షలో అతడికి పాజిటివ్ అని తేలింది. పలు అనుమానాల నేపథ్యంలో జెనోమిక్ సీక్వెన్సింగ్ కోసం అతడి నమూనాలను పంపించగా.. గురువారం అతడికి ఒమిక్రాన్ అని తేలింది. అయితే రెండు డోసులు తీసుకోవడంతో ఆ వైద్యుడికి తీవ్రమైన లక్షణాలు లేవు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు.
Also Read: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. రెండో టెస్టుకు ముగ్గురు స్టార్ ప్లేయర్స్ దూరం! ఇక సిరీస్ కష్టమే!!
సదరు వైద్యుడికి 13 ప్రాథమిక కాంటాక్ట్ మరియు 205 ద్వితీయ కాంటాక్ట్ (ఆసుపత్రి సిబ్బంది)లు ఉన్నట్టు తెలిసింది. అందరికి టెస్ట్ చేయగా.. రెండు ప్రైమరీ కాంటాక్ట్‌లు మరియు ఒక సెకండరీ కాంటాక్ట్ పాజిటివ్‌గా తేలారు. వారి నమూనాలను జెనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. వైద్యుడి భార్య, 13 ఏళ్ల కుమార్తెకు పాజిటివ్ తేలగా.. 6 ఏళ్ల కుమారుడికి మాత్రం నెగిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. ముందస్తు చర్యలో భాగంగా బాలుడికి మరోసారి టెస్ట్ చేయనున్నారు. వైద్యుని సహోద్యోగికి పాజిటివ్ అని తేలింది. అతని భార్య మరియు అత్తయ్యతో సహా ద్వితీయ పరిచయాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. డాక్టర్‌తో పరిచయం ఉన్న ఆరుగురు రోగులను పరీక్షించగా నెగెటివ్‌గా తేలింది. ఇక వైద్యుడు పనిచేసిన ఆపరేషన్ థియేటర్లను శానిటైజ్ చేశారు.
Also Read: Corona cases in India: దేశంలో మళ్లీ లక్షకు చేరువలో యాక్టివ్ కరోనా కేసులు
వైద్యుడికి (Bengaluru Doctor ) ఒమిక్రాన్ సోకింది ఆసుపత్రిలో మాత్రం కాదని సమాచారం తెలుస్తోంది. నవంబర్ 20న బెంగళూరులోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో అతడు డాక్టర్ల కాన్ఫరెన్స్‌కు హాజరయ్యాడట. నవంబర్ 22న స్వల్ప లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. సదరు ఆసుపత్రి నుంచి కాన్ఫరెన్స్‌కు హాజరైన నలుగురు వైద్యులు పాజిటివ్ అని తేలారు. అందులో ముగ్గురికి డెల్టా వేరియంట్ సోకగా.. ఒకరికి ఒమిక్రాన్ సోకింది. దాంతో మిగతావారి నమూనాలను జెనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. ఏదేమైనా ఒమిక్రాన్ భారత్‌లోకి ఎంటర్ అవ్వడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook