Impact of Alcohol Consumption on Male Fertility: మద్యం సేవించే మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందా.. ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. చెన్నైలోని చెట్టినాడు అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్‌, చెట్టినాడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పరిశోధనలో ఇది నిజమేనని వెల్లడైంది. సంతానలేమికి మద్యం సేవించడం కూడా ఒక ప్రధాన కారణంగా వెల్లడైంది. దీనికి సంబంధించిన జర్నల్‌ను పరిశోధక బృందం ఇటీవల విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ జర్నల్ ప్రకారం... మొత్తం 231 మంది మగవారిపై పరిశోధన జరిపారు. ఇందులో 81 మంది మద్యం తాగే అలవాటు ఉన్నవారు కాగా.. మిగతా 150 మంది మద్యం అలవాటు లేనివారు. డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్‌ను అనుసరిస్తూ వీరికి సెమెన్, స్పెర్మ్ కౌంట్‌ టెస్టులు నిర్వహించారు. ఆ టెస్టుల ఫలితాలను విశ్లేషించగా... మద్యం సేవించేవారిలో స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ క్వాలిటీ తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. 


స్పెర్మ్ ఉత్పత్తికి కారణమయ్యే హార్మోన్లతో పాటు టెస్టోస్టిరాన్ హార్మోన్ల విడుదలపై ఆల్కాహాల్ ప్రభావం చూపడం వల్ల మద్యం తాగేవారిలో స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ పడిపోతున్నట్లు గుర్తించారు. అయితే మద్యం తీసుకునే స్థాయిని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలా దీని ప్రభావం ఉంటుందని తేల్చారు. సర్వేలో మద్యం తాగే 81 మందిపై పరిశోధన జరపగా.. నిత్యం ఆల్కాహాల్ సేవించే 31 మంది స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ అతి తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగా వారు సంతానానికి దూరమవుతున్నారని.. దీనికి సంబంధించి మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. మద్యం తాగే అలవాటు ఉన్నవారిని క్రమంగా ఆ అలవాటుకు దూరం చేసే చర్యలు తీసుకుంటే సంతానోత్పత్తి సామర్థ్యం పెరిగే అవకాశం ఉండొచ్చునని అంటున్నారు.


Also Read: Anushka Shetty Casting Couch: టాలీవుడ్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. నేను కూడా..! షాకింగ్ కామెంట్స్ చేసిన అనుష్క!! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook