మిడిల్ క్లాస్ వారికి సొంత  కారు కలను సొంతం చేస్తామన్న టాటా కంపెనీ..లక్ష రూపాయలే కారు మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. 2009లో విడుదలైన ఈ కార్లుకు మంచి ఆదరణ వచ్చింది. అయితే ప్రస్తుతం దీన్ని పట్టించునేవారు కరువయ్యారు. గత ఆగస్టు నెలలో 180 యూనిట్ల కోసం ఆర్టర్ రాగా..అక్టోబర్ నాటికి దాని సంఖ్య 50కి పడిపోయింది. డీలర్ల నుంచి ఆర్డర్లు రాకపోవడంతో ఈ కార్లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నానో కు ప్రచారం కరువు..


టాటా మోటార్స్ వారి ఇతర ఉత్పత్తులు నెక్సాన్, టియాగో, హెక్సా, టిగోర్ కార్లకు ప్రచారం చేస్తూ నానో గురించి పెద్దగ పట్టించుకోవడం లేదు.. అందుకే దీని డిమాండ్ క్రమంగా తగ్గతూ ..ఇప్పడు ఈ స్థితికి కారణమైంది. దేశంలో దిగువ మధ్యతరగతి వారి సొంత కారు కలను నిజం చేయాలనే రతన్ టాటా ఆశయం మొదట్లో సక్సెక్ అయినప్పటికీ ..సరైనా ప్రచారం చేని కారణంగా నానో డిమాండ్ తగ్గినట్లుగా మార్కెట్లు నిపుణులు విశ్లేషించారు.