దేశీయ విమాన సర్వీసులు మే 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), పౌర విమానయాన శాఖ ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆరోగ్యసేతు యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం లాంటి ఎన్నో కొత్త నిబంధనలు మార్గదర్శకాలలో చేర్చారు. 14 ఏళ్లలోపు పిల్లలకు ఆరోగ్య సేతు యాప్ అవసరం లేదు.  ఏపీ, తెలంగాణ నుంచి వెళ్లే రైళ్లు ఇవే..


సోమవారం నుంచి అమలుకానున్న మార్గదర్శకాలివే: 


  • టెర్మినల్‌లోకి ప్రవేశించక ముందే మాస్క్ ధరించడం తప్పనిసరి.

  • ప్రయాణానికి కనీసం రెండు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలి.

  • కేంద్ర హోంశాఖ సూచనల ప్రకారం.. సొంత వాహనం లేక అధికారిక పర్మిషన్ ఉన్న టాక్సీలు, వాహనాల్లోనే ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లాలి

  • ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు అధికారులు సూచించిన అన్ని సూచనలు పాటించాలి.

  • ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిని ఆరోగ్యసేతు యాప్ ద్వారా గానీ లేక స్వీయ ధ్రువీకరణ ద్వారాగానీ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాలి.  రానా, మిహికా ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వచ్చేశాయ్..

  • వెబ్ చెక్ ఇన్ చేసుకుని బోర్డింగ్ పాస్‌తో రావాలి.

  • బ్యాగేజీ ట్యాగ్/ ఐడెంటిటీ నెంబర్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. దాన్ని మీ లగేజీకి అతికించాలి.

  • బ్యాగేజీ ట్యాగ్ పొందలేని పక్షంలో మీ టికెట్ పీఎన్ఆర్ నెంబర్‌ను బాగా కనిపించేలా తెల్లటి కాగితంపై రాసి మీ లగేజీ బ్యాగుకు అతికించాలి.

  • ఇతర ప్రయాణికుల నుంచి భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి

  • ఒక లగేజీ బ్యాగ్, ఓ నార్మల్ బ్యాగ్ (వెంట తీసుకెళ్లే చిన్న బ్యాగ్) అనుమతిస్తారు.

  • వృద్ధులు, గర్భిణులు, జలుబు, దగ్గు, జ్వరంతో పాటు అనారోగ్యంతో ఉన్నవారిని విమాన ప్రయాణాలు చేయవద్దని సూచన

  • డిజిటల్ పేమెంట్స్ చేయడం ఉత్తమం, పర్మిషన్ ఉన్న వాహనాలలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. 

  • విమానం బయలుదేరడానికి 4 గంటల ముందు నుంచి టెర్మినల్‌లోకి ప్రయాణికులను అనుమతిస్తారు.

  • ప్రయాణికులతో సంభాషించే ఎయిర్‌పోర్ట్  సిబ్బంది ముఖానికి ఫేస్ మాస్క్, లేక ఫేస్ షీల్డ్స్ ఉండాలని సూచించిన ఏఏఐ.

  • ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి కచ్చితంగా పీపీఈ కిట్లు అందించాలి.

  • విమానాశ్రయాల్లో క్రమం తప్పకుండా శానిటైజేషన్ చేయాలి.

  • గతంలో మాదిరిగా టెర్మినల్ బిల్డింగ్, లాంజ్‌ల్లో మ్యాగజైన్స్, దినపత్రికలు లాంటివి అనుమతించరు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
    వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్