హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్బంగా, తెలంగాణ సీఎం కేసీఆర్ కు  అరుదైన అవకాశం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం ఇచ్చే విందులో కేసీఆర్ పాల్గొన్నాలని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరి 25న రాష్ట్రపతి భవన్‌లో డోనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారని, ప్రధాని నరేంద్ర మోదీతో సహా కొద్ది మంది కేంద్ర మంత్రులకే రాష్ట్రపతి ఆహ్వానం అందిందని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. అసోం, హర్యానా, కర్నాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ ముఖ్యమంత్రులకు మాత్రమే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందిందని తెలిపింది. కాగా, ఈ నెల 25న మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలంగాణ సీఎంఓ వర్గాలు తెలిపాయి. 


మరోవైపు డోనాల్డ్ ట్రంప్, భారత పర్యటన సందర్బంగా తన సతీమణి మెలానియా ట్రంప్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మెలానియా ట్రంప్, దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారని పేర్కొన్నారు. కాగా, పాఠశాలను సందర్శించే వారి జాబితాలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు లేకపోవడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి.     
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..