న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ న్యూఢిల్లీలో మహాత్మా గాంధీ సమాధిని సందర్శించారు. సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి రాజ్ ఘాట్ చేరుకున్న ట్రంప్ అక్కడ గాంధీజీ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. గాంధీ సమాధికి ప్రదక్షిణ కూడా చేశారు. అనంతరం సమాధి వద్ద ఒక్క నిమిషం పాటు ట్రంప్ దంపతులు మౌనం వహించారు. రాజ్ ఘాట్ ప్రత్యేకతను అధికారులను అమెరికా అధ్యక్షుడు అడిగి తెలుసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ‘నమస్తే ట్రంప్’ నుంచి బై బై ట్రంప్ వరకు



విజిటర్స్ బుక్‌లో డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసి తన అభిప్రాయాల్ని అందులో నమోదు చేశారు. అనంతరం అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా కూడా విజిటర్స్ బుక్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గాంధీ మెమోరియల్ రాజ్ ఘాట్ వద్ద ట్రంప్ దంపతులకు జాతిపిత గాంధీ జ్ఞాపికను అధికారులు అందజేశారు. మహాత్ముడి సమాధి సందర్శన సందర్భంగా ట్రంప్ మొక్కను నాటి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.


Also Read: ఏపీ, తెలంగాణ రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల 


రాజ్ ఘాట్ సందర్శన అనంతరం ట్రంప్ దంపతులు హైదరాబాద్ హౌస్‌కు చేరుకున్నారు. ఇక్కడ అమెరికా, భారత ఉన్నతాధికారులు పలు అంశాలపై చర్చించి కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అంతకుముందే హైదరాబాద్ హౌస్ చేరుకుని అన్ని ఏర్పాట్లు పరిశీలించారు. నేటి ఉదయం 10 గంటలకు ట్రంప్ దంపతులు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. త్రివిధ దళాల నుంచి సైనిక వందనం స్వీకరించారు. రాత్రి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో భేటీ తర్వాత రెండ్రోజుల పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో అమెరికాకు తిరుగు ప్రయాణం కానున్నారు.


Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..