Donald Trump India visit 2020: భారత్‌లో డొనాల్డ్ ట్రంప్ పర్యటన ఇలా సాగనుంది

అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి ఫిబ్రవరి 24, 25 తేదీలలో రెండ్రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ట్రంప్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.

Last Updated : Feb 24, 2020, 02:02 PM IST
Donald Trump India visit 2020: భారత్‌లో డొనాల్డ్ ట్రంప్ పర్యటన ఇలా సాగనుంది

న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణకు మరికొన్ని గంటల్లో తెర పడనుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. నేటి ఉదయం దాదాపు 11:55 గంటల ప్రాంతంలో ఆయన భారత్ చేరుకోనున్నారు. సతీమణి మెలానియా ట్రంప్ సమేతంగా ఎయిర్‌ఫోర్స్‌ 1 విమానంలో ఆయన వాషింగ్టన్‌ డీసీ నుంచి ఆదివారం రాత్రి బయలుదేరారు. వీరితో పాటు కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ కూడా భారత్‌కు విచ్చేస్తున్నారు. వీరు రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించనుండగా ట్రంప్ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: భారత్‌ పర్యటనకు డొనాల్డ్ ట్రంప్.. కూలిన స్వాగత ద్వారాలు
ఫిబ్రవరి 24న ట్రంప్‌ షెడ్యూల్‌
తొలుత గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విమానాశ్రయంలో ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతీ ఆశ్రమానికి చేరుకుంటారు. ప్రముఖ సబర్మతీ ఆశ్రమం వద్ద ట్రంప్, మోదీలు కలసి మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు. అనంతరం గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను అమెరికా అధ్యక్షుడికి మోదీ బహూకరిస్తారు.

Donald Trumps India visit schedule  

అహ్మదాబాద్‌లో ఆధునికీకరించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాకు వెళ్తారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ నిర్వహించే భారీ సభకు దాదాపు 1.25 లక్షల మంది ప్రజలు హాజరుకానున్నారు. 

అహ్మదాబాద్‌లోనే మధ్యాహ్నం ప్రముఖ రాజకీయ నాయకులతో కలిసి భోజనం చేస్తారు. భారతీయ ఆహార పదార్థాలను వీరికి రుచి చూపించనున్నారు. 

సోమవారం సాయంత్రం ట్రంప్ దంపతులు ఆగ్రాలోని తాజ్‌మహల్‌‌ను సందర్శిస్తారు. రాత్రికి ఢిల్లీలోని ఐటీసీ మయూరా లగ్జరీ హోటల్‌లో సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి బస చేయనున్నారు.

Also Read: మొతెరా స్టేడియం ప్రత్యేకతలు ఇవిగో..

ఫిబ్రవరి 25న ట్రంప్‌ షెడ్యూల్‌
న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీ సమాధిని ప్రధాని మోదీతో కలసి ట్రంప్ సందర్శిస్తారు. అక్కడ జాతిపితకు నివాళులు అర్పించనున్నారు. 

గాంధీకి నివాళులర్పించిన తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ.  అనంతరం హైదరాబాద్‌ హౌస్‌లో ట్రంప్, భేటీ కీలక భేటీ కానున్నారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా పలు అంశాలు చర్చించి, కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.   

ఓవైపు ట్రంప్, మోదీలు కీలక భేటీలో ఉండగా.. అమెరికా అధినేత భార్య మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు.

సీఈఓ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రముఖ వ్యాపార వేత్తలతో డొనాల్డ్ ట్రంప్ చర్చిస్తారు. కాస్త విశ్రాంతి తీసుకున్న అనంతరం షెడ్యూలు ప్రకారం మంగళవారం రాత్రి పది గంటలకు ట్రంప్ ఫ్యామిలీ అమెరికాకు తిరుగు ప్రయాణం కానున్నట్లు సమాచారం.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News