DRDO: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధిలో డీఆర్డీవో పాత్ర కీలకమైంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో దూసుకుపోతోంది. ఇప్పుడు స్వదేశీ వారధిని అభివృద్ధి చేసి..ఘనత సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ సాంకేతికతపై ఫోకస్ ఎక్కువైంది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి రంగంలో కీలకంగా ఉన్న డీఆర్డీవో( DRDO ) స్వదేశీ టెక్నాలజీతో అరుదైన ఘనతను సొంతం చేసుకుంటోంది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు వీలుగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో వారధిని అభివృద్ధి చేసింది.


ఈ వారధి పది మీటర్ల పొడుగుండి..వాగులు, వంకలు వంటి అడ్డంకుల్ని వేగంగా దాటేందుకు భారత ఆర్మీ ( Indian Army ) కు ఉపయోగపడుతుంది. లార్సెన్ అండ్ టూబ్రోకు చెందిన తాలేగావ్ ఫ్యాక్టరీలో ఈ వారధిని ఆర్మీకు అందించారు. డీఆర్డీవో, ప్రైవేట్ కంపెనీలు సంయుక్తంగా వారధిని అభివృద్ధి చేశాయి. ఇప్పటివరకూ ఇటువంటి వారధులను విదేశాల్నించి దిగుమతి చేసుకోగా..ఈసారి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. 


Also read: New coronavirus strain: భారత్‌లో పెరుగుతున్న కొత్త వైరస్ కేసులు