Driver shows middle finger to 66year old woman: ఓ వృద్ధురాలిని దూషించడంతో పాటు ఆమెకు మిడిల్ ఫింగర్ చూపించి హేళన చేసిన ఓ కారు డ్రైవర్‌కు కోర్టు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ముంబైలోని గిర్గావ్ కోర్టు (Mumbai Court) ఇటీవల తీర్పు వెలువరించింది. వృద్దురాలు తనపై తప్పుడు కేసు పెట్టిందని సదరు క్యాబ్ డ్రైవర్ ఆరోపించగా.. న్యాయస్థానం కొట్టిపారేసింది. ఆ వయసులో ఆమె తన క్యారెక్టర్‌ను పణంగా పెట్టి ఇలాంటి కేసులు పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసు వివరాలను పరిశీలిస్తే... 2018, సెప్టెంబర్ 17న ముంబైకి (Mumbai) చెందిన 66 ఏళ్ల ఓ వృద్దురాలు తన కుమారుడితో కలిసి కారులో ఆఫీస్‌కు బయలుదేరారు. కారు క్యాడ్బరీ జంక్షన్‌కు చేరుకున్నాక... పక్క నుంచి ఓ రెడ్ కలర్ కారు వేగంగా దూసుకెళ్లింది. ఆ రాష్ డ్రైవింగ్‌కు (Rash driving) వృద్దురాలు ప్రయాణిస్తున్న కారు డివైడర్ వైపుకు నెట్టివేయబడింది. అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వెళ్లగా... అదే రెడ్ కలర్ కారు డ్రైవర్... వీళ్లు ప్రయాణిస్తున్న కారును  మరోసారి ఓవర్‌ టేక్ చేసే ప్రయత్నం చేశాడు.


అక్కడి నుంచి ముందుకెళ్లి మరో జంక్షన్ వద్ద వృద్దురాలి కారు ఆగగా... ఆ రెడ్ కలర్ కారు వీరి పక్కనే వచ్చి ఆగింది. ఆ వెంటనే కారు విండో ఓపెన్ చేసిన సదరు కారు డ్రైవర్.. వృద్దురాలి వైపు మిడిల్ ఫింగర్ చూపించాడు. అంతేకాదు, ఆ వృద్దురాలిని, ఆమె కొడుకును దూషించాడు. ఆపై సిగ్నల్ జంప్ (Signal jump) చేసి వేగంగా ముందుకెళ్లగా... వృద్దురాలు, ఆమె కొడుకు తమ కారులో అతన్ని చేజ్ చేసి అడ్డుకున్నారు. అనంతరం ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు అప్పగించారు.


వృద్దురాలు అతనిపై కేసు పెట్టడంతో అప్పటి నుంచి గిర్గావ్ కోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. ఇటీవల తుది విచారణ ముగియడంతో కోర్టు సదరు డ్రైవర్‌కు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది. అంతకుముందు, కేసు విచారణ సందర్భంగా నిందితుడు వృద్దురాలిపై పలు ఆరోపణలు చేశాడు. వృద్దురాలి  కొడుకు న్యాయవాది కావడంతో అతని పలుకుబడి ఉపయోగించి తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆరోపించాడు. అయితే న్యాయస్థానం అతని ఆరోపణలను తోసిపుచ్చింది. సమాజంలో ప్రతీ మహిళ ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటుందని... 66 ఏళ్ల వయసులో ఆమె తన క్యారెక్టర్‌ను పణంగా పెట్టి తప్పుడు కేసు (Viral news) పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది.


Also Read: దళిత యువకులపై దాష్టికం... గుంజీలు తీయించి,నేలపై ఉమ్మి నాకించిన వైనం...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook