Motor Vehicles: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్
Motor Vehicles documents | న్యూ ఢిల్లీ: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటు ( DL, Vehicle fitness certificates) తేదీని ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
Motor Vehicles documents | న్యూ ఢిల్లీ: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటు ( DL, Vehicle fitness certificates) తేదీని ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు లాక్‌డౌన్ విధించడం, సామాజిక దూరం పాటించాల్సిన ఆవశ్యకత ఏర్పడిన నేపథ్యంలో వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఆ తేదీని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఓ ప్రకటన విడుదల చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..