Driving License New Rules: డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఓ పెద్ద ప్రక్రియ. ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరగడం, స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్, బయోమెట్రిక్ ఇలా 4-5 సార్లు తిరిగితేనే గానీ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందనే గ్యారంటీ లేదు. కానీ ఇక ఈ కష్టాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ చెబుతోంది. కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నియమాలు రూపొందించింది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఆర్టీవో ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. స్లాట్ బుకింగ్ ఉండదు. అన్నింటికీ మించి డ్రైవింగ్ టెస్ట్ ఉండదు. ఎలాంటి టెస్ట్‌లు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ సులభంగా పొందవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా సంస్థ జారీ చేసిన కొత్త రూల్స్ ప్రకారం ఇకపై ప్రైవేట్ డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్‌లే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికేట్లు జారీ చేస్తాయి. అయితే ప్రభుత్వం గుర్తింపు పొందిన డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ సంస్థలకే ఆ అధికారం ఉంటుంది. అంటే డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్‌లు డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేశాక డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి సర్టిఫికేట్ జారీ చేస్తాయి. దాని ఆధారంగా లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటే సులభంగా పొందవచ్చు. 


ఎలాంటి సంస్థలకు అధికారం


అయితే ఈ తరహా అనుమతులు అన్ని డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ సంస్థలకు ఉండదు. ఫోరా్ వీల్ డ్రైవ్ టెస్ట్ సంస్థకు మూడెకరాల స్థలం ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా టెస్ట్ నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలుండాలి. డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేవాళ్లు కూడా హైస్కూల్ విద్య పూర్తి చేసుకుని డ్రైవింగ్‌లో ఐదేళ్లు అనుభవం కలిగి ఉండాలి. బయోమెట్రిక్ టెక్నాలజీపై అవగాహన కలిగి ఉండాలి. అలాంటి సంస్థలకే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి సర్టిఫికేట్ జారీ చేసే అధికారాన్ని ప్రభుత్వం ఇస్తుంది. డ్రైవింగ్ శిక్షణ కూడా లైట్ వెహికల్ అయితే నాలుగు వారాలు కనీసం 29 గంటల శిక్షణ ఉండాలి. ఇందులో 21 గంటలు ప్రాక్టికల్స్ అయితే 8 గంటలు థియరీ ఉండేట్టు చూసుకోవాలి. అదే హెవీ వెహికల్ డ్రైవింగ్ అయితే ఆరు వారాలు 39 గంటల శిక్షణ అవసరం. ఇందులో థియరీ 8 గంటలే ఉంటుంది కానీ ప్రాక్టికల్స్ 31 గంటలుండాలి. ఈ నియమ నిబంధనలు కచ్చితంగా పాటించేవారికే డ్రైవింగ్ టెస్ట్ సర్టిఫికేట్ జారీ చేసే అధికారం కల్పిస్తారు. 


ఈ సర్టిఫికేట్ ఆధారంగా ఆర్టీవో కేంద్రంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటే ఎలాంటి ఇతర పరీక్షల్లేకుండానే లైసెన్స్ మంజూరు చేస్తారు. ఆర్టీవో కేంద్రాల్లో ముందుగా తీసుకునే ఎల్ఎల్ఆర్ తరువాత చేయాల్సిన ప్రక్రియ ఇది. 


Also read: AP TS Weather Forecast: నైరుతి రుతుపవనాలొచ్చేశాయి, ఏపీ తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook