Driving License Rules: మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, తీసుకుందామనుకుంటున్నారా..అయితే ఇది మీ కోసమే. కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కొత్త నిబంధనలు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్నటివరకూ డ్రైవింగ్ లైసెన్సుల కోసం ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరగడం ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల ప్రకారం ఆ అవసరం లేదు. చాలా సులభంగానే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కొత్తది తీసుకోవాలన్నా లేదా రెన్యువల్ చేయించాలన్నా ఇక నుంచి సులభమే. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిబంధనలు మార్చింది. కొత్త నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆ కొత్త నిబంధనలేంటో చూద్దాం..


జూలై 1, 2022 నుంచి అమలు కానున్న కొత్త నిబంధనలు


కొత్త నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. జాతీయ రోడ్డు భద్రత, హైవే మంత్రిత్వ శాఖ కొత్త నియమాల్ని జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనుంది. కొత్త నియమాల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిరీక్షిస్తున్న కోట్లాదిమందికి ఉపశమనం కలగనుంది. ఆర్టోవో కార్యాలయంలో డ్రైవింగ్ టెస్ట్ కోసం నిరీక్షించాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవింగ్ ట్రైనింగ్ స్కూల్‌లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ అనంతరం అక్కడే టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. టెస్ట్ పాస్ అయితే..స్కూల్ నుంచి ఓ సర్టిఫికేట్ అందుతుంది. ఆ సర్టిఫికేట్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ లభిస్తుంది. 


డ్రైవింగ్ లైసెన్స్ కోర్సు ఎలా ఉంటుంది


డ్రైవింగ్ లైసెన్స్ కోసం ట్రైనింగ్ సిలబస్ కూడా సిద్దమైంది. ఈ సిలబస్ థియరీ, ప్రాక్టికల్ రెండు విభాగాలుగా విభజించారు. లైట్ మోటార్ వెహికల్ కోసం కోర్సు వ్యవధి 4 వారాలుగా ఉంది. ప్రాక్టికల్ కోసం మీరు రోడ్లు, హైవే, నగరంలోని రోడ్లు, ఊర్లలోని వీధులు, రివర్స్, పార్కింగ్ వంటి ప్రాక్టికల్స్ కోసం 21 గంటలకు వ్యవధి ఉంటుంది. మిగిలిన 8 గంటల్లో థియరీ నడుస్తుంది. 
 
ట్రైనింగ్ సెంటర్ కోసం మార్గదర్శకాలు


డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల కోసం కొన్ని మార్గదర్శకాలు జారీ అయ్యాయి. టూ వీలర్, త్రీ వీలర్, లైట్ మోటార్ వాహనాల శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కనీసం ఒక ఎకరం స్థలముండాలి. హెవీ వెహికల్ ట్రైనింగ్ కోసం రెండు ఎకరాల స్థలముండాలి. శిక్షణ ఇచ్చే వ్యక్తి కనీసం 12వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. దాంతోపాటు ఐదేళ్లు డ్రైవింగ్ అనుభవముండాలి. డ్రైవింగ్ సెంటర్స్ కోసం సిలబస్ థియరీ, ప్రాక్టికల్స్‌గా విభజించారు. ట్రైనింగ్ సెంటర్ల వద్ద బయోమెట్రిక్ వ్యవస్థ తప్పనిసరి. మీడియం, హెవీ వాహనాల కోసం 6 వారాల్లో 38 గంటల్లో కోర్సు ఉంటుంది.ఇందులో 8 గంటలు థియరీ, 31 గంటలు ప్రాక్టికల్స్ ఉంటాయి.


Also read: Mohali RPG Attack: ఇంటెలిజెన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌పై రాకెట్‌ దాడి, ఉగ్రవాదుల పనే అని అనుమానం..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook