శ్రీదేవి మృతి కేసులో కీలకంగా మారనున్న 2201
దుబాయ్ యొక్క నియమాల ప్రకారం, ఆసుపత్రి వెలుపల ఎవరైనా మరణిస్తే, అది సహజ మరణమైనా సరే.. పోలీసులు మొత్తం విచారణ జరుపుతారు.
ఈ నెంబర్ శ్రీదేవి దుబాయిలో బస చేసిన హోటల్ జుమారా ఎమిరేట్స్ టవర్ రూం నెంబర్. శ్రీదేవి ఈ గదిలోనే ప్రమాదవశాత్తు స్నానాల తొట్టిలో మునిగిపోవటం వల్లే చనిపోయిందని దుబాయి ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. అందుకే పోలీసులు ఈ రూంను ఇంచుఇంచు మరోసారి తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు శ్రీదేవి కాల్ రికార్డులను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. హోటల్ సిబ్భందిని కూడా ప్రశ్నించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న శ్రీదేవి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. మీడియా రిపోర్టుల ప్రకారం, దుబాయ్ పోలీసులు పోస్ట్ మార్టం తర్వాత, కొన్ని చిక్కుముడులకు సమాధానం వెతకడం కోసం ఇదంతా చేస్తున్నారు. ప్రశ్నలకు అన్ని సమాధానాలు దొరికిన తర్వాత మంగళవారం మృతదేహం భారతదేశానికి పంపబడుతుందని వెల్లడించింది.
దుబాయ్ యొక్క నియమాల ప్రకారం, ఆసుపత్రి వెలుపల ఎవరైనా మరణిస్తే, అది సహజ మరణమైనా సరే.. పోలీసులు మొత్తం విచారణ జరుపుతారు. ఇప్పుడు పోలీసులు కూడా చేస్తున్నది అదే..! శ్రీదేవి చనిపోయాక ఆ హోటల్ గదిని పోలీసులు సీల్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు శ్రీదేవి మృతదేహం అల్ ఖుస్సైస్ లో మర్చూరీలో ఉంటుంది.