Sadhvi Ritambara: దేశంలో మత సామరస్యం దెబ్బతినే వ్యాఖ్యలు ప్రతిరోజూ ఏదోమూల విన్పిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి సాధ్వి రితాంబర వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ సన్యాసిని చేసిన వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూ సన్యాసిని సాధ్వి రితాంబర..తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటోంది. బాబ్రీ మసీదు కూల్చివేత ముస్లింలపై యుద్ధం ప్రకటించడం వంటి వివాదాస్పద కేసుల్ని ఎదుర్కొన్న సాధ్వి రితాంబర ఇప్పుడు మరోసారి వివాదం రేపారు. స్వయంగా సన్యాసిని అయిన సాధ్వి రితాంబర ఇతర సంసారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.


దేశంలో ఒక్కొక్క హిందువు నలుగురు పిల్లల్ని కనాలని..అందులో ఇద్దరిని సంఘ్ సంస్థలకు ఇచ్చేయాలని పిలుపునిచ్చింది. ఇలా చేస్తే ఇండియా హిందూ రాజ్యంగా మారుతుందని పిలుపునిచ్చింది. ఈమె దుర్గా వాహిని సంస్థ, వీహెచ్‌పీ మహిళా విభాగం వ్యవస్థాపకురాలుగా ఉంది. ఇప్పటి వరకూ హిందువులు అనుసరించిన మేమిద్దరం మాకిద్దరు సిద్ధాంతం వద్దని సూచించింది. ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన రామ మహోత్సవ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో జరుగుతున్న మత ఘర్షణల్ని ప్రస్తావించింది. దేశాభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు హనుమాన్ శోభాయాత్రపై దాడి చేశారని చెప్పుకొచ్చింది.


రాజకీయ ఉగ్రవాదం ద్వారా హిందువుల్ని విభజించాలని చూస్తే..మట్టికరిపిస్తామని ఆమె హెచ్చరించింది. దేశంలో హిందూవుల జనాభా పెరగాలని సూచించింది. దేశంలో ఇప్పటికే మతపరమైన కలహాలు అక్కడక్కడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సాధ్వి రితంబర వంటి వ్యక్తులు చేసే వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.


Also read: Delhi Corona Update: ఢిల్లీలో పెరుగుతున్న కరోనా సంక్రమణ, రేపు డీడీఎంఏ భేటీలో కీలక నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook