Earthquake In Uttarakhand: ఉత్తరకాశీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతగా నమోదు! నేపాల్‌లో కూడా
Earthquake of magnitude 3.1 strikes in Uttarakhand. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 2.19 గంటలకు భూమి కంపించింది.
Earthquake of magnitude 3.1 hits Uttarkashi in Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున 2.19 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభవించాయని చెప్పింది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో.. ఇండ్లలో నిద్రపోతున్న జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం ద్వారా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
ఉత్తరకాశీలో డిసెంబర్ 19న కూడా స్వల్ప భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 1.50 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. ఉత్తరకాశీకి 24 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభవించాయని పేర్కొంది.
నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (NEMRC) ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున నేపాల్‌లోని బగ్‌లుంగ్ జిల్లాలో 4.7 మరియు 5.3 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. రీడింగుల ప్రకారం.. బగ్‌లుంగ్ జిల్లాలోని అధికారి చౌర్ ప్రాంతంలో 01:23 (స్థానిక కాలమానం)కి 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో రెండవ భూకంపం బగ్‌లుంగ్ జిల్లాలోని ఖుంగా చుట్టూ 02:07 (స్థానిక కాలమానం)కి సంభవించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నేపాల్ అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.
Also Read: Today Gold Price: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఇలా!
Also Read: Connect Movie: నయనతార కనెక్ట్ సినిమా నెట్‌ఫ్లిక్స్ విడుదల ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.