మతపరమైన వ్యాఖ్యలను చేసినందుకు యోగి,మాయవతిలపై ఈసీ చర్యలు తీసుకుంది. మత విధ్వేషాలు రెచ్చొగొట్టేలా వ్యాఖ్యానించారంటూ యూపీ సీఎం యోగి అధిత్యనాథ్ పై 72 గంటలు , మాయావతిపై 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల సంఘం ఆదేశాల  ప్రకారం యోగి 3 రోజులు పాటు... మాయావతి 2 రోజులు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలి. ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నేతలపై ఈసీ చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి.


ఎన్నికల ప్రచారంలో యోగి మాట్లాడుతూ 'మీకు అలీ ఉండే మాకు బజరంగ్‌బలి ఉన్నారు' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఇది హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడమేనంటూ ఆయనపై ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి.


మాయావతి సైతం మత ప్రాతిపదికపైనే బీజేపీ టిక్కెట్లు ఇస్తోందని ఆరోపించారు. యోగికి ఓట్లేసేటప్పుడు అలీ, బజరంగ్‌బలి అంటూ యోగి చేసిన వ్యాఖ్యలను ముస్లింలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల కమిషన్ ఈ మేరకు చర్యలకు దిగింది.