నిరుద్యోగులకు ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ECIL) శుభవార్త అందించింది. హైద‌రాబాద్‌లోని ఈసీఐఎల్‌ కాంట్రాక్ట్ పద్ధతిలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీ చేపట్టింది. ఈ మేరకు ద‌ర‌ఖాస్తుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 350 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.  హైదరాబాద్ (హెడ్ క్వార్టర్)‌లో 200 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, న్యూఢిల్లలో 40, బెంగళూరులో 50, ముంబయిలో 40, కోల్‌కతాలో 20 ఖాళీలకు నియామకాలు చేపట్టారు. Telangana: భారీగా పెరిగిన కరోనా కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అభ్యర్థులకు 31.07.2020 నాటికి 30 సంవత్సరాలకు మించ‌కూడ‌దు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఆన్‌లైన్‌ ద్వారా టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి, తగిన అనుభ‌వం ఉండాలి. ఆగస్టు 30తో దరఖాస్తులకు తుది గడువు ముగియనుంది. 
టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్


ఈ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను అక‌డ‌మిక్ మెరిట్‌, ఆపై డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత ఎంపిక చేస్తారు. 


అప్లై చేసుకునేందుకు క్లిక్ చేయండి (Click Here to Apply for Technical Officer Posts)


Movies On OTT: ‘జనవరి వరకు థియేటర్లకు నో ఛాన్స్’