Ramoji Rao Death: ఈనాడు అదినేత రామోజీ రావు ఇక లేరు
మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తుది శ్వాస విడిచారు. నిన్నటి నుంచి వెంటిలేటర్ పై ఉన్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ramoji Rao Death: మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తుది శ్వాస విడిచారు. నిన్నటి నుంచి వెంటిలేటర్ పై ఉన్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తీవ్రమైన అనారోగ్యంతో గత కొద్దికాలంగా బాధపడుతున్న రామోజీరావు ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో నానక్‌రామ్ గూడలోని స్టార్ ఆసుపత్రికి జూన్ 5 వతేదీన తరలించారు. తీవ్రమైన రక్తపోటు, శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. దాంతో ఆయనను ఐసీయూలోనే వెంటిలేటర్‌పై ఉంచారు. ఇవాళ ఉదయం 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు.
మూడ్రోజుల క్రితమే ఆయనకు స్టార్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసి స్టంట్స్ అమర్చారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించినట్టు తెలుస్తోంది. వయోభారంతో ఎదురయ్యే అనారోగ్య సమస్యలే ఆయనకు ఎక్కువగా ఉన్నాయి.
1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో జన్మించిన రామోజీరావు 88 ఏళ్ల వయస్సులో ఇవాళ తెల్లవారుజామున మరణించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన రామోజీరావు ప్రస్థానం ప్రియా పచ్చళ్లతో ప్రారంభమై ఆ తరువాత ఈనాడు పత్రికతో గణనీయమైన కీర్తిని సంపాదించుకున్నారు. అనంతర కాలంలో ప్రపంచంలోనే అతి పెద్ద థీమ్ పార్క్, ఫిల్మ్ స్డూడియో నిర్మించారు. అన్ని భాషల్లో ఈటీవీ నెట్‌వర్క్, ఈనాడు పత్రిక, మార్గదర్శి చిట్‌ఫండ్స్, కళాంజలి, ఉషాకిరణ్ మూవీస్, డాల్ఫిన్ గ్రూప్ హోటల్స్ ఇలా అన్నింటికీ విజయవంతంగా నడిపిన ఘనత ఆయనది.
రామోజీరావు మృతిపట్ల దేశమంతా నిర్ఘాంతపోయింది. ప్రధానమంత్రి మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అమిత్ షా, నడ్డా, శరద్ పవర్, నితీష్ కుమార్, మమత బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, చంద్రబాబు, మాజీ సీఎం జగన్, నారా లోకేష్, ఏపిసిసి అధ్యక్షురాలు షర్మిల, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, వైఎస్ జగన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.రామోజీ రావు అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
Also read: Attack on Varma: ఇది ప్లాన్ ప్రకారం జరిగిన హత్యాయత్నమేనంటున్న మాజీ ఎమ్మెల్యే వర్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook