Jammu kashmir: జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దనేది  ఓ కీలక పరిణామం. ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రంలో పరిణామాలు మారుతాయని అందరూ ఊహించారు. మరి అలా జరిగిందా లేదా. పరిస్థితులు మారాయా, ఆస్థుల పరిస్థితి ఏంటనేది కేంద్ర ప్రభుత్వ సమాధానంతో తేటతెల్లమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ను(Article 370 Abrogation) 2019 ఆగస్టు 5న రద్దు చేసి..కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 370(Article 370) కారణంగా జమ్ముకశ్మీర్‌లో ఇతర ప్రాంతాలకు చెందినవారెవరూ ఆస్థులు కొనుగోలు చేయకుండా నిషేధం ఉండేది. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పెద్దఎత్తున ఇతర ప్రాంతాలవారు ఆస్థులు కొనుగోలు చేస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెద్దఎత్తున పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఆస్థులు కొనుగోలు చేయడంతో కశ్మీర్ అభివృద్ధి చెందుతుందని అంతా ఆశించారు. కానీ అటువంటి మార్పేమీ అక్కడ కన్పించడం లేదు. ఏ విధమైన కొనుగోళ్లు జరగలేదు.కేంద్ర ప్రభుత్వం(Central government) ఇచ్చిన సమాధానమే దీనికి నిదర్శనం. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్టికల్ 370 (Article 370)రద్దు అనంతరం జమ్ముకశ్మీర్‌(Jammu kashmir)లో కేవలం ఇద్దరంటే ఇద్దరు ఆస్థుల్ని కొనుగోలు చేసినట్టు మంత్రి తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఇంకా ఆ భయం పోలేదు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. ఉగ్రవాదుల భయం ఇంకా కొనసాగుతోంది. దీనికితోడు కరోనా సంక్రమణ, లాక్‌డౌన్ వంటివి అదనపు కారణాలుగా ఉన్నాయని తెలుస్తోంది. 


Also read: ఇండియన్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై సస్పెన్షన్ వేటు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook